Begin typing your search above and press return to search.
వంగా కోసం ఆగలేను అంటున్న రౌడీగారు!
By: Tupaki Desk | 1 May 2020 4:00 PM IST'అర్జున్ రెడ్డి' టాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఒక్కస్టారిగా యూత్ ఐకాన్ గా మారిపోగా.. దర్శకుడు సందీప్ వంగా ఓ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా ఎప్పుడు వస్తుంది అనేది ప్రేక్షకులకు ఆసక్తికరమైన అంశం. ఈమధ్యే విజయ్ కూడా ఈ టాపిక్ పై వంగాను తొందరపెట్టడం విశేషం.
లాక్ డౌన్ కారణంగా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో విజయ్ దేవరకొండ తన వంతుగా విరాళం ప్రకటించడంతో పాటుగా ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ఓ ఫండ్ ను ఏర్పాటు చేసి సహాయం అందించే కార్యక్రమం చేపట్టాడు. ఈ విషయంపై స్పందిస్తూ సందీప్ వంగా ట్విట్టర్ ద్వారా విజయ్ ను అభినందించాడు. దీనికి విజయ్ రిప్లై ఇస్తూ "వంగా నిన్ను మిస్సవుతున్నా. ప్లీజ్ ఈ లాక్ డౌన్ లో 2-3 స్క్రిప్టులు పూర్తి చెయ్.. నేను షూట్ కోసం రెండేళ్ళు ఆగలేను" అంటూ సందీప్ వంగాను కోరాడు.
ఈ రిప్లైతో ఫ్యాన్స్ లో ఒక్కసారిగా ఫుల్ జోష్ వచ్చింది. అర్జున్ రెడ్డిని మించి మరో సినిమా చేయాలనీ ఒకరంటే.. కోట్లమంది ఎదురుచూస్తున్నారు.. త్వరగా మొదలు పెట్టండి అని మరొకరు అన్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమాలో నటిస్తున్నాడు. 'కబీర్ సింగ్' తర్వాత సందీప్ వంగా నెక్స్ట్ సినిమా ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు. మరి ఇద్దరూ కలిసి మరో సినిమాకు రెడీ అవుతారేమో వేచి చూడాలి. రౌడీ-వంగా కాంబో లో సినిమా అంటే అనౌన్స్మెంట్ రోజు నుండే అది సంచలనాలు సృష్టిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మీకు అనుమానం ఏమైనా ఉంటే ఆ కరోనా పైన ఒట్టు.