Begin typing your search above and press return to search.

థ్రిల్ల‌ర్ మోడ్ లో రౌడీ బ్ర‌ద‌ర్

By:  Tupaki Desk   |   7 Oct 2019 10:59 AM GMT
థ్రిల్ల‌ర్ మోడ్ లో రౌడీ బ్ర‌ద‌ర్
X
`దొర‌సాని` చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యమైన ఆనంద్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం రెండో సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా మూడో సినిమా వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. ఆనంద్ ఈసారి కామెడీ థ్రిల్ల‌ర్ జోన‌ర్ లో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలో న‌టించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ల‌ఘుచిత్రాలతో ఫేమ‌స్ అయిన‌ దామోదర అట్టాడ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. టాంగా ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి (యూ.ఎస్.ఏ) ప‌తాకం పై విజయ్ మట్టపల్లి - ప్రదీప్ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విజయ దశమి సందర్భంగా తాజా చిత్రాన్ని ప్ర‌క‌టించారు.

దామోదర అట్టాడ ఓ మంచి కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీతో వచ్చాడు. ఈ కథ ఆనంద్ దేవరకొండ కు స‌రిగ్గా స‌రిపోతుంది. కామెడీ థ్రిల్లర్ జోన‌ర్ లో ఆనంద్ లుక్ కూడా కొత్తగా ఉంటుందని నిర్మాత చెబుతున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు క‌థానాయిక‌ల్ని ఎంపిక చేసారు. త్వరలోనే నాయిక‌ల‌ పేర్లు ప్రకటించ‌నున్నారు. అలాగే ఈ చిత్రంతో ముగ్గురు కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నవంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. మ‌ద‌న్ గుణ‌దేవా సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

ఒక‌టో సినిమా సెట్స్ లో ఉండ‌గానే యువ‌హీరోల‌కు అవ‌కాశాలొస్తున్నాయి. ఆ కోవ‌లో చూస్తే ఆనంద్ దేవ‌ర‌కొండ ఒకే ఏడాదిలో మూడు సినిమాలు చేసేస్తుండ‌డం ఆస‌క్తిక‌రం. దొర‌సాని త‌ర్వాత కెరీర్ ని వేగంగానే ప‌రుగులు పెట్టిస్తున్నాడు. అయితే త‌దుప‌రి చిత్రాల‌తో స‌క్సెస్ అందుకుని అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పుకోవాల్సి ఉంటుంది.