Begin typing your search above and press return to search.

ఎన్నడూ చూడని మాస్ లుక్కులోకి రౌడీ హీరో!

By:  Tupaki Desk   |   19 May 2020 6:00 AM IST
ఎన్నడూ చూడని మాస్ లుక్కులోకి రౌడీ హీరో!
X
ప్రస్తుతం ఫైటర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి ఫైటర్ అనే టైటిల్ ఫిక్స్ అయిందని అందరూ అనుకున్నారు కానీ తాజాగా టైటిల్ అది కాదని తేల్చేసారు.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఇక టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ హీరో అంటే డిఫరెంట్ మాస్ లుక్ ఉండటం ప్రత్యేకం. ఇక పూరీ సినిమాలో నటించే హీరోలు ఆయనతో సినిమా చేసిన తర్వాత కమర్షియల్ గా ఒక రేంజ్ లో దూసుకుపోతారు. ఇదివరకే క్లాస్ గా కనిపించే రామ్ ని కూడా పూరి జగన్నాథ్ తనకు సరిపోయే ఊర మాస్ లుక్కులోకి మార్చుకున్నాడు.

ఇక పూరి డైరెక్షన్లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అదే లో ఫైటర్ మీద దృష్టిపెట్టిన పూరి జగన్నాథ్ విజయ్ లుక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడట. దీనికోసం ముంబైలో సిట్టింగ్ ఏర్పాటుచేసి బాలీవుడ్ హెయిర్ స్టైలిస్ట్ దగ్గర విజయ్ హెయిర్ స్టైల్ ను సెట్ చేసే పనిలో పడ్డాడట పూరీ. తాజా సమాచారం ప్రకారం.. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా కొత్త లుక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇదిలా ఉండగా విజయ్ పూరీ సినిమా తర్వాత నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ, మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఒక్కో సినిమా చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. పూరి జగన్నాథ్ హీరోగా విజయ్ దేవరకొండ ఎంతవరకు ప్రేక్షకుల్ని మెప్పిస్తాడు అనేది వేచి చూడాలి.