Begin typing your search above and press return to search.

రౌడీ బాయ్ రొమాన్స్ టైమ్‌

By:  Tupaki Desk   |   18 Oct 2021 8:29 AM IST
రౌడీ బాయ్ రొమాన్స్ టైమ్‌
X
స‌క్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా ఆశిష్ ‌రెడ్డి ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌ గా న‌టిస్తున్న ఈ మూవీకి `హుషారు` ఫేమ్ హ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దిల్ రాజు స్వీయ నిర్మాణ సంస్థ‌లో నిర్మిస్తున్న ఈ మూవీ టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌లై మంచి టాక్‌ ని తెచ్చుకుంది. కాలేజీ నేప‌థ్యంలో సాగే యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్‌ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. అనుప‌మ‌ని యంగ్ హీరో ఆశిష్ ‌రెడ్డి హ‌గ్ చేసుకున్న తాజా స్టిల్ సినిమా ఎంత రొమాంటిక్ ‌గా వుండ‌బోతోందో స్ప‌ష్టం చేస్తోంది. త్వ‌ర‌లో రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతున్న ఈ మూవీకి సంబంధించిన `ప్రేమే ఆకాశం` అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ ని ఈ నెల 20న రిలీజ్ చేస్తున్న‌ట్టు చిత్ర బృందం తాజాగా ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఈ మూవీకి సంబంధించిన ప్ర‌మోష‌న్స్‌ని ఇటీవ‌లే ప్రారంభించి స్పీడు పెంచారు.

శిరీష్‌ తో క‌లిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ఇప్ప‌టికే మంచి క్రేజ్‌ ని సొంతం చేసుకుంది. దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి `మిర్చి` ఫేమ్ మ‌దీ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. మ‌ధు ఎడిట‌ర్‌గా వ్య‌వ‌హరిస్తున్న ఈ మూవీతో దిల్ రాజు త‌మ ఫ్యామిలీ వార‌సుడిని హీరోగా నిల‌బెట్టాల‌ని చేస్తున్న ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.