Begin typing your search above and press return to search.
ఇన్ స్టాలో నంబర్ -1 సౌత్ హీరో మన రౌడీ
By: Tupaki Desk | 19 May 2021 4:00 PM ISTయూనిక్ క్వాలిటీస్ తో తనదైన విలక్షణతతో దూసుకుపోవడం కొందరికే సాధ్యమైన విద్య. తీరైన రూపురేఖలు.. మంచి మాటకారితనం .. అంతకుమించిన చాకచక్యం.. పదిమందితో కలిసే చొరవ.. మాటల్లో నిజాయితీ.. ఫ్యాషన్ అనుకరణలో ట్రెండ్ ని సెట్ చేయడం... ఇన్ని క్వాలిటీస్ తో ఉన్నవాడు కాబట్టే అన్ని ఇండస్ట్రీస్ లో విజయ్ దేవరకొండ పేరు మార్మోగుతోంది.
మహేష్- ప్రభాస్- అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలు సోషల్ మీడియాల్లో ఎంత స్పీడ్ మీద ఉన్నా కానీ .. వీళ్లందరినీ మించిన ఫాలోవర్స్ ని సంపాదించాడు విజయ్ దేవరకొండ. యూత్ ఐకన్ గా వెలిగిపోతున్నాడు. తనదైన ఒరవడి ఫ్యాషన్ ఎంపికలతో అతడు అంతర్జాలంలో నిరంతరం ట్రెండింగ్ అవుతూనే ఉన్నాడు. ఇటీవల లైగర్ లాంటి పాన్ ఇండియా సినిమాతో అటు ఉత్తరాదినా ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు.
అందుకే ఇప్పుడు అతడిని అరుదైన రికార్డ్ వరించింది. ఇన్ స్టా వేదికగా సౌతిండియా నంబర్ -1 హీరోగా అతడి పేరు రికార్డులకెక్కింది. 1కోటి 20లక్షల (12మిలియన్లు) మంది ఫాలోవర్స్ తో ఇన్ స్టాలో ఈ స్టాటస్ ని దక్కించుకున్నాడు మన రౌడీ. సౌతిండియాలో వేరొక హీరో ఈ సమీపంలో లేరు. ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సజావుగా పాన్ ఇండియా కేటగిరీలో రిలీజై హిట్టు కొడితే అతడి క్రేజు మార్కెట్ విలువ అమాంతం పెరుగుతుంది. ప్రస్తుతం కోవిడ్ విలయం వల్ల షూటింగ్ కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.