Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : 'సామ్‌ జామ్‌' కోసం ఇలా రౌడీ స్టార్‌

By:  Tupaki Desk   |   10 Nov 2020 3:40 PM IST
ఫొటోటాక్‌ : సామ్‌ జామ్‌ కోసం ఇలా రౌడీ స్టార్‌
X
సమంత టాక్‌ షో సామ్‌ జామ్‌ స్ట్రీమింగ్‌ కు సిద్దం అయ్యింది. మొదటి ఎపిసోడ్‌ గా విజయ్‌ దేవరకొండ తో సమంత ఇంటర్వ్యూ ను ఆహాలో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. సమంత మరియు విజయ్‌ దేవరకొండలు మంచి స్నేహితులు. వీరిద్దరు కూడా ఖచ్చితంగా ఆసక్తికర విషయాలు మాట్లాడుకుని ఉంటారు. వీరిద్దరి మద్య సాగిన గేమ్స్‌ మరియు సందడి చాలా హై లెవల్‌ లో ఉండి ఉంటుంది అంటూ సమంత అభిమానులు అటు విజయ్‌ దేవరకొండ అభిమానులు ఆ టాక్‌ షో కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో సామ్‌ జామ్‌ లో విజయ్ దేవరకొండ ఎలా కనిపించబోతున్నాడు అనే విషయమై క్లారిటీ ఇస్తూ ఫొటోలను షేర్‌ చేశారు.

విజయ్‌ దేవరకొండ సామ్‌ జామ్‌ టాక్‌ షో లో చాలా స్టైలిష్‌ లుక్‌ లో కనిపించాడు. ఎప్పటిలాగే కాస్త పొడవైన హెయిర్‌ స్టైల్‌ మరియు కాస్త ఒత్తయిన గడ్డంతో కనిపించాడు. ఇక కాస్ట్యూమ్స్ విషయంలో ఎప్పటిలాగే రౌడీ స్టార్ చాలా స్టైలిష్‌ గా కనిపించాడు. మొత్తానికి సమంత ప్రతిష్టాత్మక సామ్‌ జామ్‌ షో మొదటి ఎపిసోడ్‌ ను చాలా స్టైలిష్‌ గా విజయ్‌ దేవరకొండ మార్చబోతున్నాడు. ఇక ఈ ఎపిసోడ్‌ లో సమంత కూడా చాలా స్టైలిష్‌ గా కనిపించబోతుంది. రెడ్‌ అండ్‌ బ్లాక్‌ లో సూపర్‌ క్యూట్‌ స్మైల్‌ తో కనిపించబోతుంది. ఆహాలో సామ్‌ జామ్‌ మొదటి ఎపిసోడ్‌ ఈనెల 13 నుండి స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. ఒక స్టార్‌ హీరోయిన్‌ మొదటి సారి తెలుగులో టాక్‌ షో ను హోస్ట్ చేయబోతుంది. కనుక షో పై అంచనాలు భారీగా ఉన్నాయి.