Begin typing your search above and press return to search.

'గల్లీ రౌడీ' గా మారిన 'రౌడీ బేబీ'!

By:  Tupaki Desk   |   25 March 2021 8:02 AM GMT
గల్లీ రౌడీ గా మారిన రౌడీ బేబీ!
X
యంగ్ హీరో సందీప్‌ కిషన్‌ - 'మెహబూబా' ఫేమ్ నేహా శెట్టి జంటగా 'రౌడీ బేబీ' అనే సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కోన వెంకట్‌ సమర్పణలో కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ - ఎంవీవీ సినిమా పతాకాలపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.నాగేశ్వరరెడ్డి ఈ కామెడీ ఎంటర్టైనర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా సినిమా టైటిల్ ని మార్చబోతున్నామని.. కొత్త టైటిల్ మరింత ఆసక్తికరంగా ఉంటుందని కోన వెంకట్ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకు న్యూ టైటిల్ ని ఖరారు చేశారు.

'రౌడీ బేబీ' సినిమా టైటిల్ ను 'గల్లీ రౌడీ' గా మారుస్తున్నట్లు తెలియజేస్తూ మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. దీనిని పూరీ జగన్నాథ్ - హరీష్ శంకర్ - గోపీచంద్ మలినేని - శివ నిర్వాణ - బాబీ లాంచ్ చేశారు. ఈ టైటిల్ ని కూడా సేమ్ ఫాంట్ లో ఉండేలా డిజైన్ చేసినట్లు అర్థం అవుతోంది. కాగా, 'గల్లీ రౌడీ' చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహా - నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చౌరస్తా రామ్‌ మిరియాల సంగీతం సమకూరుస్తున్నాడు. సుజాత సిద్ధార్థ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఛోటా కె.ప్రసాద్‌ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


వీడియో కోసం క్లిక్ చేయండి