Begin typing your search above and press return to search.

చిరు సినిమా ఛాయల్లో తేజు తమ్ముడి మూవీ ?

By:  Tupaki Desk   |   4 Feb 2019 7:23 AM GMT
చిరు సినిమా ఛాయల్లో తేజు తమ్ముడి మూవీ ?
X
మెగా ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరోగా సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఇటీవలే లాంచ్ అయిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్సిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం వైష్ణవ్ తేజ్ రెగ్యులర్ గా యూత్ సినిమాల్లో కనిపించే కాలేజీ స్టూడెంట్ లాగా కాకుండా కోస్తా ప్రాంతంలో నివసించే బెస్తవాడిగా కనిపించనున్నట్టు తెలిసింది. అయితే ఈ విషయం చూచాయగా వెనుక నుంచి కట్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లోనే అర్థమైపోయినప్పటికీ ఎవరూ పూర్తి అంచనాకు రాలేకపోయారు.

ప్రేమకథ బ్యాక్ డ్రాప్ లో ఉంటూనే చాలా ఇంటెన్సిటీ ఉన్న లవ్ స్టోరీ గా దీన్ని ప్రెజెంట్ చేస్తారట. సుకుమార్ కుమారి 21ఎఫ్ తరహాలోనే తాను నిజ జీవితంలో చూసిన కథనే స్ఫూర్తిగా తీసుకుని ఇది రాయించినట్టు తెలిసింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే తరహా బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ చిరంజీవి 1988లో ఆరాధన చేసారు. ఇళయరాజా వన్ అఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ గా నిలిచిన ఈ మూవీకి భారతిరాజా దర్శకుడు.

అయితే ఆ సమయంలో చిరుకున్న ఇమేజ్ ప్రతిబంధకాల వల్ల తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయినప్పటికీ తెలుగు రీమేక్ ఆశించిన విజయం సాధించలేదు. అది తీరప్రాంతంలో చేపలుపట్టే వాళ్ళ నేపథ్యంలోనే సాగుతుంది. ఫీల్ తో కూడిన లవ్ స్టోరీ కూడా ఉంటుంది. మళ్ళి ఇన్నాళ్లకు వైష్ణవ్ తేజ్ అలాంటి ప్రయత్నమే చేయబోతున్నాడన్న మాట. మొత్తానికి రెగ్యులర్ ఫార్మాట్ లో వెళ్లకుండా విభిన్నంగా ట్రై చేస్తున్న వైష్ణవ్ కు డెబ్యూ మూవీనే స్పెషల్ గా నిలిచేలా కనిపిస్తోంది