Begin typing your search above and press return to search.

కొత్త పెళ్లి కొడుకు బ్యాక్ గ్రౌండ్‌ వర్క్‌ చేశాడట

By:  Tupaki Desk   |   2 Oct 2021 9:00 AM IST
కొత్త పెళ్లి కొడుకు బ్యాక్ గ్రౌండ్‌ వర్క్‌ చేశాడట
X
రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన పెళ్లి సందడి సినిమాలో శ్రీకాంత్‌ హీరోగా నటించాడు. ఇప్పుడు ఆయన నిర్మాణంలో పెళ్లి సందD అనే సినిమా రాబోతుంది. దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పెళ్లి సందD సినిమా తో రోషన్ పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. నిర్మల కాన్వెంట్‌ సినిమాలోనే నటుడిగా ఎంట్రీ ఇచ్చిన రోషన్‌ హీరోగా మాత్రం పెళ్లి సందD సినిమాతో మారబోతున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ మొదలు అయినప్పటి నుండి అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలుకు తగ్గట్లుగా సినిమాను తెరకెక్కించారని ట్రైలర్‌ చూస్తుంటే నమ్మకం కలుగుతుంది. హీరో శ్రీకాంత్‌ తనయుడు కనుక రోషన్‌ కు ఈజీగా ఎంట్రీ దక్కిందనే కామెంట్స్ కొందరు చేస్తున్నారు. రోషన్ హీరోగా అంత సింపుల్ గా ఏమీ రాలేదని.. ఆయన పడ్డ కష్టం గురించి కొద్ది మందికే తెలుసు అంటూ శ్రీకాంత్‌ తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు.

రోషన్‌ కు మొదటి నుండి నటనపై చాలా ఆసక్తి. ఆ ఆసక్తితో యాక్టింగ్‌ లో డిప్లమా చేశాడు. ఆ తర్వాత డైరెక్షన్‌ డిపార్ట్‌ మెంట్‌ లో వర్క్‌ చేసేందుకు గాను కొన్నాళ్లు శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత ప్రభుదేవా వద్ద రెండు సంవత్సరాలు డైరెక్షన్‌ టీమ్‌ లో వర్క్ చేశాడు. ప్రభుదేవాకు రెండేళ్లు శిష్యుడిగా చేసి డైరెక్షన్ మెలుకువలు తెలుసుకున్న రోషన్‌ నటుడిగా రాటు తేలాడు. హీరో అవ్వాలంటే అన్ని విభాగాలపై పట్టు ఉండాలి. అందుకే రోషన్‌ అన్ని విభాగాల్లో కూడా భాగస్వామ్యం అయ్యాడు అంటూ శ్రీకాంత్‌ పేర్కొన్నాడు. నటుడు కావాలనే పట్టుదలతో చాలా కష్టపడ్డాడు.. బ్యాక్ గ్రౌండ్‌ వర్క్‌ చాలా చేసిన తర్వాతే హీరోగా రాఘవేంద్ర రావు గారు అవకాశం ఇవ్వడం జరిగిందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

నిర్మల కాన్వెంట్‌ సినిమా తో పూర్తి స్థాయి హీరోగా గుర్తింపు దక్కించుకోలేక పోయిన రోషన్ ఈ సినిమాతో నటుడిగా పేరు దక్కించుకుంటాడా అనేది చూడాలి. రాఘవేంద్ర రావుతో కలిసి ఈ సినిమాలో రోషన్‌ పలు సన్నివేశాల్లో నటించాడు. ఆ సమయంలో రాఘవేంద్ర రావు నుండి ప్రశంసలు దక్కించుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి పెళ్లి కొడుకుగా శ్రీకాంత్‌ తనయుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతు మొదటి విజయాన్ని సొంతం చేసుకుంటాడని అంతా ఆశిస్తున్నారు. హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ శ్రీకాంత్‌ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు అదే దారిలో ఆయన తనయుడు రోషన్ కూడా సక్సెస్ అవుతాడేమో చూడాలి.