Begin typing your search above and press return to search.

తెలంగాణ సీఎం పాత్రలో లెజెండరి యాక్టర్.. ఎవరంటే..?

By:  Tupaki Desk   |   10 July 2020 3:30 PM GMT
తెలంగాణ సీఎం పాత్రలో లెజెండరి యాక్టర్.. ఎవరంటే..?
X
టాలీవుడ్ సినీ చరిత్రలోని విల‌క్ష‌ణ న‌టులలో సీనియర్ నటుడు కోట శ్రీనివాస‌రావుకు పేరు తప్పకుండా ముందు వరుసలో ఉంటుంది. ఎందుకంటే ఆయన సినీ జీవితంలో చూపించని హావభావాలు లేవు.. ఆయన వేయ‌ని పాత్ర‌లు కూడా లేవు. అవును మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం. ఇండియాలో తెలుగే కాకుండా పలు ఇండస్ట్రీలలో తన సత్తా చాటిన ఘనత ఆయనది. ఒక తండ్రిగా.. మామగా.. విలన్.. అన్న.. కమెడియన్.. ఎమ్మెల్యే.. ముఖ్యమంత్రి.. జడ్జి.. ఇలా ప్రతీ పాత్రలో ఆయన మార్క్ సెట్ చేసుకున్నారు. కోట గారు అంటే ఇప్పటికి ఆరాధించే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఆయన నటన నుండి స్ఫూర్తి పొందిన వారు కూడా వేల సంఖ్యలో ఉన్నారు. నేడు లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు పుట్టినరోజు. ఇప్పుడు ఆయన 71 నుండి 72వ పడిలో అడుగు పెడుతున్నారు.

ఈ సందర్భంగా ఆయన తాజాగా నటించిన 'రోరి' అనే సినిమాలో నుండి ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు తెలంగాణ ముఖ్యమంత్రిగా నటిస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది. ఆ ఫోటోలో ఆయన ఇన్నోసెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక ఆయన పేరు కూడా ఆర్. రామన్న చౌదరి అని రివీల్ చేసింది టీమ్. కోట శ్రీనివాసరావు ఇప్పటి వరకు తన కెరీర్లో 650 పైగా సినిమాల్లో నటించారు. ఇక ఈ సినిమాను సీటీఎస్‌ స్టూడియోస్‌, ఎస్‌టీవీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌ సంయుక్తంగా చరణ్‌ రోరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం మొద‌టి లుక్‌ని ఇటీవ‌ల విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే సినిమా ఫస్ట్‌లుక్‌ కూడా సోష‌ల్ మీడియాలో మంచి క్రేజ్ క్రియేట్ చేసింది. రోరి సినిమాకు భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు.