Begin typing your search above and press return to search.

బాలీ విలన్ కి భలే డిమాండ్!!

By:  Tupaki Desk   |   12 July 2017 7:32 AM GMT
బాలీ విలన్ కి భలే డిమాండ్!!
X
బాలీవుడ్ విలన్ రోనిత్ రాయ్ టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ మూవీ జై లవ కుశతో తెలుగు సినీ పరిశ్రమలోకి వస్తున్న ఈ విలన్ కు.. స్వాగతం బాగానే లభిస్తోంది. ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోయినా ఆఫర్లు క్యూ కట్టేస్తున్నాయి.

హ్యాండ్సమ్ యంగ్ విలన్స్ ను దించేందుకు టాలీవుడ్ ఎఫ్పుడూ ఇంట్రెస్ట్ చూపుతుంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు రోనిత్ రాయ్ వచ్చేస్తున్నాడు. ఎన్టీఆర్ కు విలన్ గా తెరంగేంట్రం చేస్తుండడంపై జనాల్లోను.. ఇండస్ట్రీ జనాల్లోను అసక్తి బాగానే ఉంది. ఇఫ్పుడీ విలన్.. తన మరుసటి తెలుగు సినిమాకు సైన్ చేసేశాడు. తమిళ్ హిట్ మూవీ బోగన్ కు రీమేక్ గా.. రవితేజ హీరోగా రూపొందనున్న చిత్రంలో నటించే ఆఫర్ అందుకున్నాడు రోనిత్ రాయ్. అగ్లీ.. కాబిల్.. సర్కార్2 వంటి చిత్రాలలో నటించి మెప్పించిన ఈ విలన్ కు టాలీవుడ్ నుంచి మంచి ఆఫర్లే అందుతున్నాయి.

విలన్ పాత్రలకు పర్ఫెక్ట్ సూట్ అయ్యే పర్సనాలిటీ కావడంతో.. రవితేజకు ఆపోజిట్ కేరక్టర్లో తీసుకునేందుకు చూస్తునట్లు తెలుస్తోంది. రోనిత్ రాయ్ తో పాటు మరికొన్ని పేర్లు కూడా పరిశీలనలో ఉన్నా.. రోనిత్ వైపే ఎక్కువగా యూనిట్ మొగ్గుతోందని టాక్ వినిపిస్తోంది.