Begin typing your search above and press return to search.

ఒడిలో ప్రియుడితో నయన్ పోజులు!!

By:  Tupaki Desk   |   11 Jun 2016 12:48 PM IST
ఒడిలో ప్రియుడితో నయన్ పోజులు!!
X
మలయాళీ మద్దుగుమ్మ నయనతార గురించి చెప్పుకోవాలంటే.. పట్టిందల్లా బంగారం టైపు. కమర్షియల్ సినిమాలతో పాటు డిఫరెంట్ రూట్లో దూసుకుపోతూ.. వరుసగా బ్లాక్ బస్టర్స్ కొట్టేస్తోంది. ప్రస్తుతం నయన్ ఉన్న రేంజ్ ని అందుకోవడం.. సౌత్ హీరోయిన్లలో ఎవరికీ సాధ్యం కాకపోవచ్చంటే.. ఈమె కెపాసిటీ అర్ధమవుతుంది. విక్రమ్ కు జంటగా నయనతార జంటగా నటిస్తున్న ఇరుమగన్ చిత్రం అందరినీ ఆసక్తి కలిగిస్తోంది.

కేరక్టర్ అనుగుణంగా పాత్రలో ఒదిగిపోవడం నయన్ కు కొత్తేమీ కాదు. ముఖ్యంగా చియాన్ విక్రమ్ లాంటి ట్యాలెంటెడ్ హీరో పక్కన ఉన్నపుడు.. తన ట్యాలెంట్ ని ఏ రేంజ్ లో చూపించాలో ఈ భామకు బాగా తెలుసు. ముఖ్యంగా సాంగ్స్ లో అయితే తెగ రెచ్చిపోతుంది ఈ సుందరాంగి. ఇరుమగన్ పోస్టర్స్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. రీసెంట్ గా ఒడిలో ప్రియుడుని పడుకోబెట్టుకుని ముద్దులాడుతున్న నయనతార ఫోటో.. నెటిజన్లను తెగ ఆకర్షించేస్తోది. అందాలన్నీ కనిపించేలా డ్రస్సులు వేసుకుని ఆకర్షించడం పెద్ద విషయమేం కాదు. కానీ ఒంటినిండా కప్పుకునే డ్రస్సులు వేసుకుని.. అందాలన్నీ లోపలే దాచుకుని కూడా చూడముచ్చటగా మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేలా తయారైపోవడం నయన తార స్పెషాలిటీ.

ఒడిలో ప్రియుడితో సరసాలు ఆడుతున్న నయనతారను చూస్తే.. ఇలాంటి లవర్ మనకూ ఉంటే బాగుండు కదా అనిపించడం ఖాయం. ఈటైపు స్పెషల్ డోసులు ఇరుమగన్ లో చాలా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు నిత్యామీనన్ లాంటి హైలీ ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ ఉండడంతో.. తన డామినేషన్ చూపించడానికి.. నయన్ చాలానే ఎత్తుగడలు వేసిందట. అవేంటో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.