Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్ : ఫుల్‌ 'రొమాంటిక్‌'.. పూరి కుమ్మేశాడు

By:  Tupaki Desk   |   19 Oct 2021 10:33 AM GMT
ట్రైలర్ టాక్ : ఫుల్‌ రొమాంటిక్‌.. పూరి కుమ్మేశాడు
X
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తనయుడు ఆకాష్‌ పూరి బాల నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. ఆకాష్‌ హీరోగా వరుస సినిమాలతో దూసుకు వస్తున్నాడు. కరోనా వల్ల చాలా ఆలస్యం అయిన రొమాంటిక్ సినిమాను ఎట్టకేలకు వచ్చే వారంలో విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ ను రెబల్‌ స్టార్‌ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈనెల 29న విడుదల కాబోతున్న రొమాంటిక్ మూవీ పై ఉన్న అంచనాలను డబుల్‌ ట్రిపుల్‌ చేసే విధంగా ట్రైలర్ ఉంది. టైటిల్ కు తగ్గట్లుగానే సినిమా లో పుల్‌ రొమాన్స్ ఉంటుందని ట్రైలర్ ను చూస్తుంటే అర్థం అవుతోంది.

రొమాంటిక్ మూవీగా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్‌ చూస్తుంటే క్లారిటీ వస్తుంది. ఇక ఈ సినిమాను చూస్తుంటే పూరి జగన్నాద్‌ ఇడియట్‌.. లోఫర్ ఇంకా ఆయన ఇతర సినిమాలను చూసినట్లుగా ఉన్నాయి. హీరో చాలా రఫ్ గా ఒక గాలోడి మాదిరిగా పూరి సినిమాలు ఉంటాయి. ఈ రొమాంటిక్ కూడా పూరి మార్క్ సినిమా అన్నట్లుగానే అనిపిస్తుంది. ఈ సినిమాకు కథ.. స్క్రీన్‌ ప్లే మరియు మాటలు పూరి జగన్నాద్‌ అందించడంతో ఆయన గత సినిమాల తరహాలోనే ఈ సినిమా ఉండబోతుందని తేలిపోయింది. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర చాలా ప్రత్యేకంగా కనిపించబోతుందని ట్రైలర్‌ ను చూస్తే అర్థం అవుతోంది.

ఒక పోకిరి కుర్రాడు అమ్మాయి వెంట పడటం.. ప్రేమించడం కోసం కాదు అంటూనే ఆమె ప్రేమను పొందేందుకు ప్రయత్నించడం ఈ సినిమా కథగా అనిపిస్తుంది. ట్రైలర్‌ చూస్తుంటే కథ చాలా విభిన్నంగా ఉంటుందనిపిస్తుంది. ఊర మాస్ లెక్కలో స్క్రీన్‌ ప్లే సాగితే మాత్రం సినిమా కచ్చితంగా మాస్ ఆడియన్స్ కు కనెక్ట్‌ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పూరి ఆకాష్‌ నటుడిగా ఈ సినిమాతో నాలుగు మెట్లు ఎక్కేలా ఉన్నాడు. హీరోయిన్ కేతిక శర్మ మరియు ఆకాష్ పూరిల రొమాన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అవ్వడం ఖాయం.

యూత్‌ ఆడియన్స్ కోరుకునే ముద్దు సీన్స్‌.. హీరోయిన్స్ అందాల ఆరబోత మరియు హీరో మాస్ డైలాగ్స్ ఈ సినిమాలో లెక్కలేన్ని ఉన్నాయి. పైగా ఈ సినిమాలో రమ్యకృష్ణ పోలీస్ పాత్రలో కనిపించడం చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఆకాష్‌ పూరి ఈ సినిమాలో ఒక ఫుల్‌ ప్లెడ్జ్‌ హీరోగా కనిపిస్తున్నాడు. రొమాంటిక్ సినిమా కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా ట్రైలర్‌ ఒక ఊపు తీసుకు వస్తుంది అనడంలో సందేహం లేదు.

పూరి జగన్నాద్‌ తనయుడుగా ఎంట్రీ ఇచ్చిన ఆకాష్‌ పూరి హీరోగా మొదటి సినిమాతో నిరాశ పర్చినా రొమాంటిక్ తో మాత్రం మొదటి కమర్షియల్‌ సక్సెస్ ను దక్కించుకునేలా ఉంది. ప్రభాస్‌ వంటి పాన్ ఇండియా స్టార్‌ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడం వల్ల ఖచ్చితంగా సినిమా బజ్ అమాంతం పెరుగుతుంది.

రొమాంటిక్ సినిమా ట్రైలర్ ను ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయించడం వల్ల పెరిగిన అంచనాలకు తోడు ట్రైలర్ లో ఆకాష్‌ మరియు కేతిక శర్మల రొమాన్స్ అదిరిపోయేలా ఉండి అందరిని ఆకట్టుకుంటుంది.. అది కాస్త సినిమాపై మరింతగా జనాల్లో ఆసక్తి పెంచేలా చేసింది. మొత్తానికి వచ్చే వారంలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్‌ అయ్యేలా ఉందని ట్రైలర్‌ ను చూస్తుంటే అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.