Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు 'రొమాంటిక్‌'గా పూర్తి అయ్యింది

By:  Tupaki Desk   |   5 Oct 2020 9:15 AM IST
ఎట్టకేలకు రొమాంటిక్‌గా పూర్తి అయ్యింది
X
డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి తనయుడు ఆకాష్‌ పూరి హీరోగా నటిస్తున్న 'రొమాంటిక్' మూవీ ఈ ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. ప్రస్తుతం ప్యాచ్‌ వర్క్‌ షూటింగ్‌ జరుపుతున్నారు. పూరి స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనీల్‌ పాదూరి దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోగా మొదటి సినిమా మెహబూబా సినిమా నిరాశ పర్చడంతో ఈ సినిమాపై ఆకాష్‌ చాలా అంచనాలు పెట్టుకున్నాడు. రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ గా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే విడుదలైన వీడియోలు మరియు ఫొటోలతో అర్థం అవుతుంది.

ఆకాష్‌ కు జోడీగా కేతికా శర్మ హీరోయిన్‌ గా నటించింది. యూత్‌ ఆడియన్స్‌ టార్గెట్‌ గా రూపొందిన ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను రెడీ చేస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాతో అయినా జూనియర్‌ పూరి హీరోగా నిలదొక్కుకుంటాడా అనేది చూడాలి. థియేటర్ల ఓపెన్‌ కు కేంద్రం నుండి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసే అవకాశం పూర్తిగా లేదని థియేటర్లలోనే విడుదలకు ఎక్కువ అవకాశాలున్నాయని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కాలంగా ప్రచారం జరుగుతున్న రొమాంటిక్‌ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. యూత్‌ ఆడియన్స్‌ ను ఆకట్టుకుంటుందని నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. మరి అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా అనేది చూడాలి.