Begin typing your search above and press return to search.

ఓల్డ్ ఈజ్ గోల్డ్.. జ‌య‌ల‌లిత‌తో రొమాంటిక్ ఎంజీఆర్

By:  Tupaki Desk   |   24 Aug 2021 5:59 AM GMT
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. జ‌య‌ల‌లిత‌తో రొమాంటిక్ ఎంజీఆర్
X
క్వీన్ కంగనా రనౌత్ నటించిన `తలైవి` సెప్టెంబర్ 10 న విడుదలకు సిద్ధమవుతోంది. కంగన ఈ సినిమాలో జయలలిత పాత్ర‌లో న‌టించ‌గా .. అరవింద్ స్వామి దివంగ‌త న‌టుడు రాజ‌కీయ నాయ‌కుడు ఎంజిఆర్ పాత్ర‌లో న‌టించారు. జ‌య‌ల‌లిత‌-ఎంజీఆర్ రొమాంటిక్ పెయిర్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఆ ఇద్ద‌రూ త‌మిళ క్లాసిక్స్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

నాటి రోజుల్లో ఈ జంట వెండితెర వెలుగుల‌కు సంబంధించిన కొన్ని షాట్స్ లో రొమాంటిక్ మూడ్ ఎలా ఉండ‌నుంది? అన్న‌ది ఆవిష్క‌రిస్తూ తాజాగా ఓ ఫోటోగ్రాఫ్ రివీలైంది. ఈ ఫోటోలో నాటి మేటి హిట్ పెయిర్ రొమాన్స్ అద్భుతంగా పండింది. ఈ ఫోటో చూస్తుంటే 60 లు.. 70 లలో పాటల శైలిని రొమాన్స్ ని పోలి ఉంటుంది. నాటి వాతావ‌ర‌ణం .. దుస్తుల ఎంపిక క‌నిపిస్తోంది. క్లాసిక్ డేస్ కి సంబంధించిన ప్రామాణికమైన చిత్రమిద‌ని అర్థ‌మ‌వుతోంది.

రెండవ వేవ్ తర్వాత రిలీజ‌వుతున్న‌ మొదటి పాన్-ఇండియా చిత్రం త‌లైవి. ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చిన సంగ‌తి తెలిసిందే. వ‌రుస ప్ర‌మోష‌న్స్ తో ఈ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మూడు భాషల్లో విడుదల చేస్తోంది.

త‌లైవి వాయిదాల‌ ఫ‌ర్వం..

కంగనా రనౌత్ నటించిన తలైవి ఈ ఏడాది ప్రారంభంలో ఏప్రిల్ 23 న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ క‌రోనా వ‌ల్ల చిత్రీక‌ర‌ణ ఆల‌స్య‌మై వాయిదా ప‌డింది. ఇప్పుడు 2021 సెప్టెంబర్ 10 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఇంత‌కుముందే కొత్త విడుదల తేదీని కంగనా ఇన్ స్టాగ్రామ్ ప్ర‌క‌టించారు. ``అమ్మ జ‌య‌ల‌లిత‌ వ్యక్తిత్వాన్ని ఆమె కథను బిగ్ స్క్రీన్ పై మాత్రమే చూడడానికి అర్హమైనది! ఆమె సినిమా ప్రపంచంలోకి సూపర్ స్టార్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నందున... మళ్లీ అదే ధ‌ర‌హాసం! సెప్టెంబర్ 10 న మీకు సమీపంలో ఉన్న సినిమా థియేట‌ర్ల‌లోలో తలైవి చూడండి!`` అని కంగ‌న‌ ప్ర‌క‌టించారు.

నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి త‌లైవి చిత్రీక‌ర‌ణ విష‌య‌మై ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. ``తలైవి ప్రతి మలుపులో శాశ్వత అనుభవాలతో విస్తృతమైన ప్రయాణం చేశాం. దేశవ్యాప్తంగా థియేటర్లు తిరిగి తెరుస్తున్నందున‌ అభిమానులు వెండి తెర‌పై లెజెండ్ జ‌య‌ల‌లిత‌ జీవితం లోని గొప్ప అనుభూతిని ఆస్వాధించగల‌ర‌ని సంతోషిస్తున్నాము. జయలలిత ఎప్పుడూ సినీ రంగానికి చెందినవారు.ఆమె కథను సజీవంగా తెరపైకి తీసుకురావడమే ఈ గొప్ప లెజెండ్ కి విప్లవ నాయకురాలికి నివాళి అర్పించడానికి ఏకైక మార్గం`` అని ప్ర‌క‌టించారు.

దివంగత రాజకీయ నాయకురాలు నటి జె.జయలలిత జీవితం ఆధారంగా తలైవి తెర‌కెక్క‌గా.. ఆమె జీవితంలోని విభిన్న కోణాలను ఈ చిత్రంలో చూపిస్తున్నారు. చిన్న వయస్సులోనే నటిగా తమిళ సినిమాల్లో ప్ర‌వేశించి ఆ త‌ర్వాత క‌థానాయిక‌గా ఎదిగారు. విప్లవ నాయకురాలిగా స‌త్తా చాటారు. తమిళనాడు రాజకీయాల గమనాన్ని మార్చిన శ‌క్తి అయ్యారు. ఈ చిత్రం కోసం కంగ‌న మారిన రూపం అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రైలర్ పాటలు ప్రేక్షకులకు నచ్చాయి.
`తలైవి` చిత్రం సెప్టెంబర్ 10న‌ హిందీ- తమిళం- తెలుగు భాషలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

వ‌రుస బ‌యోపిక్ ల‌తో విబ్రి సంచ‌ల‌నాలు

విష్ణు ఇందూరి కి చెందిన విబ్రి మీడియా వ‌రుస‌గా బ‌యోపిక్ చిత్రాల్ని నిర్మిస్తూ సంచ‌ల‌నంగా మారింది. 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ విక్ట‌రీ నేప‌థ్యంలో టీమిండియా కెప్టెన్ క‌పిల్ దేవ్ జీవిత‌క‌థ‌తో తెర‌కెక్కిస్తున్న 83 రిలీజ్ కి రావాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి .. అగ్ర క‌థానాయిక జ‌య‌ల‌లిత జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న త‌లైవి నిర్మాణానంత‌ర ప‌నులు పూర్త‌వుతున్నాయి. ఈ రెండు చిత్రాల‌ను నిర్మిస్తున్న విబ్రి మీడియా ఇప్పుడు మ‌రో బ‌యోపిక్ కేట‌గిరీ ఫ్రాంఛైజీని ప్ర‌క‌టించింది. భారత స్వాతంత్య్ర‌ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారత స్వాతంత్య్ర‌ పోరాటంలో అన్ సంగ్ హీరోలకు నివాళిగా `అజాద్ హింద్` అనే ఫీచర్ ఫిల్మ్ ఫ్రాంచైజీని ప్రకటించారు.