Begin typing your search above and press return to search.

రొమేనియాలో ఆ పాట ఛార్ట్ బస్టర్

By:  Tupaki Desk   |   16 April 2016 11:05 AM IST
రొమేనియాలో ఆ పాట ఛార్ట్ బస్టర్
X
ఒక సినిమాలో ఓ మంచి బీట్ తో సాగే పాట ఛార్ట్ బస్టర్ గానో, వైరల్ గానో స్ప్రెడ్ అవడం సాధారణమే. కానీ ఓ తమిళ్ సినిమాలో సాంగ్ రొమేనియాలో వైరల్ గా స్ప్రెడ్ అవడమంటే అది ఖచ్చితంగా సెన్సేషన్ అనే చెప్పాలి. విజయ్ సాంగ్ కి రొమేనియాలో ఫాలోయింగ్ రావడం, అది కూడా రెండేళ్ల క్రితం విడుదలైన కత్తి సినిమాలో సెల్ఫీ పుళ్ల అనే పాట ఈ సంచలనాలకు కారణంగా నిలుస్తోంది.

'లెట్స్ టేక్ ఏ సెల్ఫీ పుళ్ల' అంటూ సాగే పాటకు తెలుగులో అర్ధమయితే... ఓ పిల్లా సెల్ఫీ తీసుకుందాం అనే. కానీ రొమేనియా పుళ్ల అంటే అది మర్మాంగానికి సంబంధించిన వర్డ్. అంటే లోపలి బాడీలో పార్ట్ ను సెల్ఫీ తీసుకుందాం అనే అర్ధం వస్తుంది. ఈ పాటను అక్కడి ఛానల్ ఒకటి ఎయిర్ చేయడంతో.. రొమేనియా జనాలంతా ఇప్పుడీ సాంగ్ ని తెగ చూసేస్తున్నారు. పబ్లిసిటీ వస్తోంది రాంగ్ రీజన్ కే అయినా.. ఇప్పుడు విజయ్ పాట యూరోప్ కంట్రీస్ లో టాప్ చార్టుల్లో నిలుస్తోంది. రెండేళ్ల క్రితం ఇక్కడ వచ్చిన ఈ పాట.. ఇప్పడు యూరోప్ లో టాప్ లో నిలవడమంటే ఖచ్చితంగా ప్రశంసించాల్సిన విషయమే.

అయితే ఈ క్రేజ్‌ ను విజయ్ ఎంతవరకు క్యాష్‌ చేసుకుంటాడని చూస్తున్నారు ఓవర్సీస్‌ డిస్ర్టిబ్యూటర్లు.