Begin typing your search above and press return to search.

ఇట‌లీలో రొమాన్స్‌.. ఫుల్లుగా చిల్ అవుతున్న మాస్ రాజా..!

By:  Tupaki Desk   |   14 March 2021 4:30 PM GMT
ఇట‌లీలో రొమాన్స్‌.. ఫుల్లుగా చిల్ అవుతున్న మాస్ రాజా..!
X
సీరియ‌ల్ ఫ్లాప్స్ తో డీలా ప‌డిపోయిన ర‌వితేజ‌కు ‘క్రాక్’ ఇచ్చిన బూస్టింగ్ అలాంటి ఇలాంటిది కాదు! త‌న కెరీర్ కే ఓ సంజీవ‌ని వంటిద‌ని చెప్పొచ్చు. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ.. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో ఫుల్ ఫామ్ లోకి వ‌చ్చిన ర‌వితేజ వెంట‌నే ‘ఖిలాడీ’ని అనౌన్స్ చేశాడు.

ప్ర‌స్తుతం ఖిలాడీ షూట్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు మాస్ మ‌హ‌రాజ్‌. ఈ మూవీని ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్నాడు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో ‘వీర’ చిత్రం వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత వీరిద్దరూ మరోసారి జట్టు కట్టారు. అయితే.. క్రాక్ లాంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత వ‌స్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

కాగా.. ప్రస్తుతం సినిమా యూనిట్ ఇటలీలో ఉంది. ఈ యూర‌ప్‌ షెడ్యూల్లో ఇప్ప‌టికే రెండు పాట‌లు షూట్ చేసిన‌ట్టు స‌మాచారం. ఇందులో హీరోయిన్ల‌తో రొమాన్స్ చేసిన సాంగ్ కూడా ఉంద‌ని తెలుస్తోంది. కాగా.. షూట్ గ్యాప్ లో ఉన్నాడో.. రోడ్ పై జాలీగా ట్రిప్ వేస్తున్నాడో తెలియ‌దుగానీ.. ఫుల్లుగా.. చిల్ అవుతున్నాడు మాస్ రాజా. ఓ చేత్తో ఫోన్ ఆప‌రేట్ చేస్తూ.. మ‌రో చేత్తో కూల్ డ్రింక్ ప‌ట్టుకొని చిరున‌వ్వులు చిందిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని త‌న ఇన్ స్టా అకౌంట్లో పోస్టు చేశాడు.

మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌య‌తి హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమాలో.. ర‌వితేజ‌ తండ్రీ కొడుకులుగా డ్యుయ‌ల్ రోల్ ప్లే చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. మే 28న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.