Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ హోం బ్యానర్‌ లో రోలెక్స్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   5 July 2022 2:30 PM GMT
ప్రభాస్‌ హోం బ్యానర్‌ లో రోలెక్స్‌ స్టార్‌
X
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హోం బ్యానర్‌ యూవీ క్రియేషన్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్ మూవీ అయిన మిర్చి సినిమా తో యూవీ క్రియేషన్స్‌ నిర్మాణంలో అడుగు పెట్టిన విషయం తెల్సిందే. మిర్చి సినిమా తర్వాత చిన్న సినిమాలను మరియు పెద్ద సినిమాలను నిర్మిస్తూ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలుస్తున్న విషయం తెల్సిందే.

వందల కోట్ల సినిమా లను నిర్మిస్తూనే మరో వైపు అయిదు పది కోట్ల చిన్న బడ్జెట్ సినిమాలను కూడా చేస్తున్న యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ ఇప్పుడు తమిళ్‌ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య మరియు మాస్ దర్శకుడు శివ కాంబోలో ఒక సినిమా రాబోతున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.

సూర్య మరియు శివ ల కాంబో సినిమా ను యూవీ క్రియేషన్స్ వారు నిర్మించేందుకు గాను రెడీ అయ్యారని తెలుస్తోంది. కేవలం తమిళ్‌ లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమా ను డబ్బింగ్‌ చేయబోతున్నారు. యూవీ క్రియేషన్స్ మూవీ అవ్వడం వల్ల ఒక తెలుగు సినిమా అన్నట్లుగానే తెలుగు ప్రేక్షకులు సూర్య.. శివ కాంబో సినిమా ను భావించే అవకాశాలు ఉన్నాయి.

ప్రభాస్ తో ప్రస్తుతం సినిమాలకు ప్లాన్‌ చేస్తున్న యూవీ క్రియేషన్స్ వారు మరో వైపు చిన్న సినిమా లను వరుసగా నిర్మించేందుకు గాను మరో బ్యానర్‌ ను ఏర్పాటు చేయడం జరిగిందట. వెబ్‌ సిరీస్ ల నిర్మాణంలో కూడా యూవీ వారు భాగస్వామ్యం అవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి.

యూనివర్శిల్‌ స్టార్ కమల్‌ హాసన్‌ నటించిన విక్రమ్‌ సినిమా లో రోలెక్స్ పాత్రలో నటించడం జరిగింది. రోలెక్స్‌ పాత్ర ఉన్నది కొద్ది సమయం అయినా కూడా అనూహ్యంగా ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన దక్కించుకున్నాడు.

ఇప్పుడు అదే సూర్య యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో శివ దర్శకత్వంలో ద్వి భాషా సినిమా ను చేయబోతున్నాడు. ఈ సినిమా తో సూర్య తెలుగు మార్కెట్‌ మరింతగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.