Begin typing your search above and press return to search.

జబర్ధస్త్ కు రోజా పూర్తిగా దూరమేనా?

By:  Tupaki Desk   |   17 April 2019 3:59 PM IST
జబర్ధస్త్ కు రోజా పూర్తిగా దూరమేనా?
X
నెలరోజులు ఎన్నికల ప్రచారంలో ఉండి జబర్ధస్త్ లో పాల్గొనని నాగబాబు, రోజాల లోటు స్పష్టంగా కనపడింది. కమెడియన్లు చేసే కామెడీకి.. రోజా, నాగబాబు నవ్వే నవ్వులకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు. అయితే ఎన్నికల పుణ్యమాని ఇద్దరూ జబర్ధస్త్ షో చేయలేదు.. నాగబాబు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా.. రోజా నగరి ఎమ్మెల్యేగా పోటీచేశారు. అయితే ఇప్పుడు రోజా శాశ్వతంగా జబర్ధస్త్ కు దూరం అవుతున్నారనే వార్త అందరినీ షాక్ కు గురిచేస్తోంది.

దాదాపు ఏపీలో వైసీపీ గాలి వీస్తోందని... వైఎస్ జగన్ సీఎం అవుతారన్న అంచనాలు పెరిగిపోయాయి. ఆ కోవలోనే వైసీపీ లో ఫైర్ బ్రాండ్ అయిన రోజాకు జగన్ హోంశాఖ లేదా శిశుసంక్షేమం లేదా ఏదైనా మంత్రి పదవి ఇస్తారన్న ఊహాగానాలు చెలరేగాయి. అయితే ఎమ్మెల్యేగా జబర్ధస్త్ లో పాల్గొన్న రోజా మంత్రిగా కూడా జబర్ధస్త్ చేయడానికి నిబంధనలు ఒప్పుకోవు. రాష్ట్రానికి మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి మరో వృత్తి చేయకూడదన్న నిబంధన ఉండడంతో ఇక రోజా జబర్ధస్త్ కు వీడ్కోలు పలకడం ఖాయమన్న ప్రచారం హోరెత్తుతోంది.

ఒక వేళ వైసీపీ గెలిచి.. రోజా మంత్రి అయితే ఇక ఆమె ఏంతో ఇష్టపడే జబర్ధస్త్ షో నుంచి అవుట్ అవ్వడం ఖాయమంటున్నారు. అయితే ఇదంతా జరగాలంటే ముందే మే 23న ఫలితాలు రావాలి. అందులో వైసీపీ గెలవాలి.. రోజా కూడా గెలవాలి.. అప్పుడే ఈ సమీకరణాలన్నీ కలిసి జబర్ధస్త్ నుంచి రోజా ఎగ్జిట్ అవుతారు. ఎక్కడ ఏమాత్రం తేడాకొట్టినా రోజాను మళ్లీ మనం జబర్థస్త్ లో చూడొచ్చు.