Begin typing your search above and press return to search.

బాలీవుడ్ 3వ సిగం డేట్ ఫిక్సైంది? ఎప్పుడంటే!

By:  Tupaki Desk   |   5 Aug 2022 2:30 PM GMT
బాలీవుడ్ 3వ సిగం డేట్ ఫిక్సైంది? ఎప్పుడంటే!
X
బాలీవుడ్ స‌క్సెస్ ఫుల్ `సింగం` ప్రాంచైజీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అజ‌య్ దేవ‌గ‌ణ్-రోహిత్ శెట్టి కాంబినేష‌న్ `సింగం` ప్రాంచైకే ఓ గుర్తింపును తీసుకొచ్చింది. యాక్ష‌న్ ఫ్యాక్డ్ థ్రిల్ల‌ర్ హిందీ అభిమానుల్ని ఓ రేంజ్ లో ఆక‌ట్టుకుంది. ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ అయిన రెండు బాగాలు హిందీ బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. `సింగం`..`సింగం రిట‌ర్న్స్` దెబ్బ‌కి బాక్సాఫీస్ కి బీట‌లే ప‌డింది.

అజ‌య్ దేవ‌గ‌ణ్ ఇమేజ్ ని రెట్టింపు చేసిన ప్రాంచైజీగా `సింగం` మంచి పేరు ద‌క్కిచుకుంది. సింగం..సింగం రిట‌ర్స్ కి పెద్ద‌గా గ్యాప్ లేదు. మూడేళ్ల గ్యాప్ లోనే రెండ‌వ భాగంగా కూడా తెర‌కెక్కించి హిట్ కొట్టారు. దీంతో ఆ వెంట‌నే సింగం-3 కూడా ప్రారంభం అవుతుంద‌ని అభిమానులు భావించారు. కానీ అంద‌రి అంచ‌నాల్ని త‌ల్లకిందులు చేస్తూ సింగం ప్రాంచైజీని అప్ప‌టితో ఆపేసారు.

మ‌ళ్లీ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఈ నేప‌థ్యంలో సింగంకి పూర్తిగా పుల్ స్టాప్ ప‌డిన‌ట్లేన‌ని మెజార్టీ వ‌ర్గం భావించింది. అయితే సింగం వేట ఇంకా ముగియ‌లేదు? మ‌ళ్లీ కొన‌సాగుతుందంటూ కొత్త అప్ డేట్ తో వ‌చ్చేసారు. `సింగం రిట‌ర్న్స్` కొన‌సాగింపుబాగా మూడ‌వ భాగానికి రంగం సిద్ద‌మ‌వుతుంది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి స్వ‌యంగా వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం రోహిత్ శెట్టి తెర‌కెక్కిస్తోన్న‌ ప్రాజెక్ట్ లు పూర్తికాగానే `సింగం-3`ని ప్రారంభిస్తామ‌ని తెలిపారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లో మూడ‌వ సింగం వేట కొన‌సాగుతుంద‌ని హింట్ ఇచ్చారు. `ఇప్ప‌టికే స్ర్కిప్ట్ సిద్ద‌మైంది. ఎప్ప‌టిలాగే ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా న‌టిస్తారు. ఆయ‌న న‌టిస్తున్న సినిమాలు పూర్తికాగానే సిగం-3 మొద‌ల‌వుతుంది.

ఇండియాలోనే అతి పెద్ద పోలీస్ చిత్రంగా దీన్ని మ‌లుస్తాం. ఇప్ప‌టివ‌ర‌కూ భార‌తీయ భాష‌ల్లో ఇలాంటి పోలీస్ చిత్రం రాలేదు? అనిపించేలా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చిత్రాన్ని తెర‌కెక్కిస్తామ‌``న్నారు. ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్ కి హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం రోహిత్ శెట్టి `ఇండియ‌న్ పోలీస్ ఫోర్స్ `అనే వెబ్ సిరీస్ తెర‌కెక్కిస్తున్నారు.

ఇక కోలీవుడ్ లో కూడా `సింగం` ప్రాంచైజీ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. సూర్య -హ‌రి కాంబినేష‌న్ లో సింగం తెర‌కెక్కుతుంది. ఇప్ప‌టికే మూడు భాగాలు రిలీజ్ అయ్యాయి. రెండు భాగాలు పెద్ద విజ‌యం సాధించ‌గా..మూడ‌వ భాగం యావ‌రేజ్ గా ఆడింది. ఈ నేప‌థ్యంలో నాల్గ‌వ భాగానికి స‌మ‌యం తీసుకుంటున్నారు. సౌత్ లో సింగం కాంబినేష‌న్ కి ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది.