Begin typing your search above and press return to search.

9 వంద కోట్ల సినిమాల దర్శకుడు

By:  Tupaki Desk   |   17 Nov 2021 4:56 AM GMT
9 వంద కోట్ల సినిమాల దర్శకుడు
X
సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా బాలీవుడ్‌ లో ఇప్పుడు వంద కోట్ల సినిమా అంటే సాదారణం అయ్యింది. కరోనా వల్ల రెండేళ్లుగా బాలీవుడ్‌ లో సినిమా లు పెద్దగా లేవు. థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ అయిన తర్వాత విడుదల అయిన మొదటి భారీ సినిమా సూర్యవంశీ. అంతా అనుకున్నట్లుగానే ఈ సినిమా వంద కోట్లకు మించి వసూళ్లను దక్కించుకుంది. ముందు ముందు కూడా వంద కోట్ల సినిమాలు మరిన్ని వస్తాయనే నమ్మకంతో సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. స్టార్‌ హీరో సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల సినిమాలను దక్కించుకుంటున్నాయి. కాని దర్శకులకు ఆ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దర్శకులు ఒకసారి చేస్తే భారీ వసూళ్లు రావచ్చు.. మరోసారి అంతగా వసూళ్లు రాకపోవచ్చు. కాని ఒక దర్శకుడు మాత్రం వరుసగా వంద కోట్ల సినిమాలను బాలీవుడ్ కు అందిస్తున్నాడు. ఆయన సినిమాలు వంద కోట్లను క్రాస్ చేసి రెండు వందల కోట్లు అంతకు మించి కూడా వసూళ్లు చేస్తున్నాయి.

ఆయన మరెవ్వరో కాదు బాలీవుడ్‌ పక్కా కమర్షియల్‌ డైరెక్టర్‌ రోహిత్‌ శెట్టి. ఈయన రీమేక్ చేసినా.. సొంత కథతో చేసినా మరే రకంగా చేసినా కూడా మాస్ తో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. ఈయన చేసే ప్రతి ఒక్క మాస్ మూవీ కూడా వంద కోట్లకు పైగానే వసూళ్లను దక్కించుకుంటూ రికార్డులు సృష్టిస్తూ వస్తోంది. మొన్న వచ్చిన సూర్యవంశీ సినిమా కూడా ఈయన దర్శకత్వంలో రూపొందినదే అనే విషయం తెల్సిందే. కరోనా సెకండ్ వేవ్‌ తర్వాత థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ అయ్యి విడుదల అయిన ఈ సినిమా కు మంచి వసూళ్లు నమోదు అవ్వడంతో బాలీవుడ్‌ కు ఊపు వచ్చింది. ఏకంగా రెండు వందల కోట్లకు పైగా వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంది. సాదారణంగా అయితే రెండు వందల కోట్లు మామూలు విషయమే.. కాని కరోనా భయం ఇంకా జనాల్లో ఉంది.. అయినా కూడా జనాలు థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూశారు అంటే ఖచ్చితంగా అది రోహిత్‌ శెట్టి వల్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సూర్యవంశీ తో కలిపి ఇప్పటి వరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన 9 సినిమా లు వంద కోట్లు అంతకు మించి వసూళ్లను దక్కించుకున్నాయి. పక్కా కరమర్షియల్‌ దర్శకుడిగా పేరున్న ఈయన బడ్జెట్‌ కూడా భారీగా ఏమీ ఖర్చు చేయడు.. విజువల్‌ వండర్ లను క్రియేట్‌ చేయడు.. భారీ సెట్టింగ్స్ ను వేయించడు.. వీఎఫ్‌ఎక్స్ కోసం కోట్లు ఖర్చు చేయడు. అయినా కూడా ఆయన పక్కా మాస్ సినిమాలను తెరకెక్కించి వందల కోట్లను సునాయాసంగా కొల్లగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఇండియన్ సినీ చరిత్రలో ఇన్ని వంద కోట్ల సినిమాలను దక్కించుకున్న దర్శకుడు లేడు. ముందు ముందు కూడా ఈయన నుండి రాబోతున్న సినిమాలు సునాయాసంగా వంద కోట్లు అంతకు మించి వసూళ్లు చేస్తాయి. కనుక ఈయన వంద కోట్ల సినిమా జాబితా మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈయన దర్శకత్వంలో చేసేందుకు బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు క్యూ కట్టడం కు కారనం ఆయన వంద కోట్ల సినిమాల జాబిత అంత ఉండటమే అంటూ విశ్లేషకులు అంటున్నారు.