Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా రాక్ స్టార్ ఫ‌స్ట్ పాప్ సాంగ్‌!

By:  Tupaki Desk   |   2 Oct 2022 1:27 PM GMT
పాన్ ఇండియా రాక్ స్టార్ ఫ‌స్ట్ పాప్ సాంగ్‌!
X
తెలుగు, త‌మిళ, క‌న్న‌డ, బెంగాలీ, హిందీ చిత్రాల‌కు సంగీతం అందించి వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్ ల‌తో రాక్ స్టార్ అనిపించుకున్నాడు సంగీత సంచ‌ల‌నం దేవి శ్రీ‌ప్ర‌సాద్‌. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప‌` మూవీకి దేవి అందించిన ఆల్బ‌మ్ వ‌ర‌ల్డ్ వైడ్ గా పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డంతో దేవి శ్రీ‌ప్ర‌సాద్ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్ట్ గా మారిపోయాడు. ఇంత వ‌ర‌కు హిందీ సినిమాల‌కు 1 లేదు రెండు సాంగ్ ల‌కు సంగీతం అందిస్తూ వ‌స్తున్నాడు దేవి.

త‌న‌తో టీసిరీస్ తాజాగా చేతులు క‌లిపింది. త‌న‌తో తొలి సారి హిందీలో పాప్ సాంగ్ ని రిలీజ్ చేస్తోంది. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన టి సిరీస్ వ‌ర్గాలు తాజాగా ఆదివారం `ఓ పారి` అంటూ సాగే ఈ పాప్ వీడియోని ద‌క్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తామంటూ ఓ వీడియోని విడుద‌ల చేసింది.

పూర్తి వీడియో సాంగ్ ని అక్టోబ‌ర్ 4న విజ‌య ద‌శమి సంద‌ర్భంగా రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని టి సిరీస్ ట్విట్ట‌ర్ హ్యాడిల్ ద్వారా వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం దేవి శ్రీ‌ప్ర‌సాద్ `పుష్ప 2`, మెగాస్టార్ చిరంజీవి తో బాబి తెర‌కెక్కిస్తున్న 154వ మూవీ `వాల్తేరు వీర‌య్య‌`కు సంగీతం అందిస్తున్నాడు. ఇక హిందీలో దేవి చేతిలో మూడు క్రేజీ సినిమాలున్నాయి.

ర‌ణ్ వీర్ సింగ్ న‌టిస్తున్న `స‌ర్క‌స్` (2 సాంగ్స్ ఓన్లీ), స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న `కిసీకీ భాయ్ కిసీకి జాన్‌`, అజ‌య్ దేవ్ గ‌న్ `దృశ్యం 2` వంటి బాలీవుడ్ క్రేజీ సినిమాల‌కు దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. `దృశ్యం 2` న‌వంబ‌ర్ 18న విడుద‌ల కానుండ‌గా, `స‌ర్క‌స్` డిసెంబ‌ర్ 23న రిలీజ్ కాబోతోంది. ఇక స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న `కిసీకీ భాయ్ కిసీకి జాన్‌` కూడా సెంటిమెంట్ ప్ర‌కారం డిసెంబ‌ర్ లోనే రిలీజ్ కు రెడీ అవుతోంది.