Begin typing your search above and press return to search.

'#RAPO19' కోసం రాక్ స్టార్..!

By:  Tupaki Desk   |   15 April 2021 4:30 PM GMT
#RAPO19 కోసం రాక్ స్టార్..!
X
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ 'ఉస్తాద్' రామ్ పోతినేని హీరోగా తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇది రామ్ కెరీర్ లో వస్తున్న 19వ సినిమా. తెలుగు తమిళ భాషల్లో రూపొందనున్న ఈ బైలింగ్వల్ లో టాలీవుడ్ సెన్సేషన్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోందని ఇటీవలే ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా '#RAPO19' చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ని చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారని మేకర్స్ వెల్లడించారు. దేవిశ్రీ గతం రామ్ హీరోగా నటించిన 'జగడం' 'రెడీ' 'నేను శైలజ' 'ఉన్నది ఒకటే జిందగీ' 'శివమ్' 'హలో గురూ ప్రేమకోసమే' వంటి చిత్రాలకు మ్యూజిక్ అందించాడు. ఇక లింగుస్వామితో కలిసి పని చేయడం ఇదే మొదటసారి. ఇప్పుడు వీరి ముగ్గురి కలయికలో వస్తున్న ఈ సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందేమో చూడాలి.

కాగా, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం.6 గా ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ని నిర్మించనున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మే నెల నుంచి జరగనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.