Begin typing your search above and press return to search.

యాక్టర్ అవతారమెత్తిన మరో ప్రొడ్యూసర్

By:  Tupaki Desk   |   24 July 2015 6:33 AM GMT
యాక్టర్ అవతారమెత్తిన మరో ప్రొడ్యూసర్
X
టెక్నీషియన్లు అడపాదడపా సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో కనిపించడం సాధారణంగా జరిగేదే. డ్యాన్స్ డైరెక్టర్లు - డైరెక్టర్లు - ఫైట్ మాస్టర్లు - ప్రొడ్యూసర్లు.. ఇలా అందరూ తమలోని నటుడిని తెరకు పరిచయం చేసినవారే. ఇలాంటివారిలో పూర్తిస్థాయి హీరో కేరక్టర్ చేసి జనాలను భయపెట్టిన డైరెక్టర్లు కూడా కూడా కొందరు ఉంటారనుకోండి... కానీ మెజారిటీ మాత్రం.. సరదాగా ఒకట్రెండ్ సీన్లకు కనిపించేవారే.

చిన్నా చితకా కేరక్టర్స్ వేసి.. ఇలా కనిపించి అలా మాయమయ్యే పాత్రల్లో... తెలుగు నిర్మాతలు కనిపించడం చాలాసార్లే చూశాం. దర్శకరత్న దాసరి.. చాలా సినిమాల్లో లీడ్ కేరక్టర్లే చేశారు. మూవీ మొఘల్, శత చిత్ర నిర్మాత రామానాయుడు... గెస్ట్ కేరక్టర్ల లో బోలెడు సినిమాల్లో కనిపించారు. ఎస్.వి.కృష్ణారెడ్డి మాంచి జోష్‌ లో ఉన్నపుడు.. కిషోర్‌ రాఠీ కూడా ఇలా కనిపించేవారు. ఇప్పుడిలా తెరమీదకి వచ్చేస్తున్నారు మరో నిర్మాత రాక్‌‌ లైన్ వెంకటేష్. ఈయన కన్నడ ప్రొడ్యూసర్ అయినా.. తెలుగోళ్లకీ బాగా తెలిసినోడే.

ఒకప్పుడు సెన్సేషనల్ మూవీ మేకర్‌ గా పేరుపొంది... ఇప్పుడు ఇండస్ట్రీ ఎక్స్‌ పెక్ట్ చేయని రేంజ్‌ లో ఫ్లాప్ చిత్రాలు తీస్తున్న డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ. కిల్లింగ్ వీరప్పన్ పేరుతో.. తెలుగు, కన్నడ భాషల్లో ఓ సినిమా తీస్తున్నారు వర్మ. దీనిలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌ కుమార్ హీరో. అయితే.. ఈ సినిమాలో ఓ పోలీస్ కేరక్టర్‌ ని రాక్‌ లైన్ వెంకటేష్‌ తో చేయిస్తున్నారు వర్మ. ప్రతీ సీన్‌ లో వెంకటేష్ యాక్షన్ చూస్తుంటే... మైండ్ బ్లాంక్ అవుతోందట యూనిట్ సభ్యులకు. ఏ మాత్రం బెరుకు లేకుండా... మెచ్యూర్డ్ ఆర్టిస్ట్‌ స్థాయిలో... ఈ ప్రొడ్యూసర్ యాక్టింగ్ చేయడం చూసి... తమ ఇండస్ట్రీకి కొత్త కేరక్టర్ ఆర్టిస్ట్ లభించినట్లే అనుకుంటున్నారు శాండల్‌ వుడ్ జనాలు.