Begin typing your search above and press return to search.

700 మంది ఫ్యాన్స్ తో... రాఖీ భాయ్ నీ ఓపికకు హ్యాట్సాఫ్‌

By:  Tupaki Desk   |   18 Dec 2022 11:00 AM IST
700 మంది ఫ్యాన్స్ తో... రాఖీ భాయ్ నీ ఓపికకు హ్యాట్సాఫ్‌
X
ఫిల్మ్‌ స్టార్స్ ఎక్కడ కనిపించినా కూడా వారి యొక్క అభిమానులు మాత్రమే కాకుండా సామాన్య జనాలు కూడా సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడుతారు. బుల్లి తెర సెలబ్రెటీలు.. సోషల్‌ మీడియా సెలబ్రెటీలను కూడా కొందరు వదిలి పెట్టకుండా ఫొటోలు తీసుకుని వాటిని తమ గ్యాలరీల్లో భద్రపర్చుకుని చూసుకుని మురుస్తూ ఉంటారు.

ఒక స్టార్‌ తనను అభిమానించే వారికి ఫొటోలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఒక్కసారిగా ఎగబడి వచ్చి ఇబ్బంది పెడితే మాత్రం ఫోటో షూట్స్ కు ఆసక్తి చూపించరు. అభిమానులు అని కూడా చూడకుండా అక్కడ నుండి వెళ్లి పోవడం మనం చూస్తూ ఉంటాం. కొందరు సెల్ఫీ లు తీసుకుంటూ ఉంటే ఫోన్ లాక్కోవడం జరుగుతుంది.

అయిదు.. పది మంది తో సెల్ఫీలు దిగిన వెంటనే చాలా మంది స్టార్స్ కి ఓపిక తగ్గుతుంది. దాంతో ఇంకా అభిమానులు ఉన్నా కూడా అక్కడ నుండి వెళ్లి పోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ కేజీఎఫ్ స్టార్‌ యశ్‌ మాత్రం ఏకంగా 700 మంది తో సెల్ఫీలు దిగి అందరిని ఆశ్చర్యపర్చాడు.

తాజాగా బెంగళూరులో ఒక ఈవెంట్‌ లో పాల్గొన్న రాఖీ భాయ్ యశ్‌ ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ సందర్భంగా అభిమానులు ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు పోటీ పడ్డారు. నిర్వాహకులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించినా కూడా యశ్‌ మాత్రం వారితో ఫొటోలు దిగేందుకు ఓకే చెప్పాడు.

పది కాదు.. ఇరవై కాదు.. ఏకంగా ఏడు వందల మంది తో యశ్ చాలా ఓపికగా సెల్ఫీ లు దిగి అందరిని సంతోష పెట్టాడు. తమ అభిమాన రాఖీ భాయ్‌ తో సెల్ఫీ తీసుకునే అవకాశం దక్కిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం తో అక్కడ నుండి వెళ్లారట. ఈ మధ్య కాలంలో ఇలా ఏ ఒక్క హీరో కూడా అభిమానులకు సెల్ఫీ లు ఇవ్వలేదు అంటూ సోషల్‌ మీడియాలో యశ్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఇక యశ్‌ సినిమాల విషయానికి వస్తే కేజీఎఫ్ 2 సినిమా విడుదల అయ్యి ఏడాది కావస్తున్నా కూడా ఇప్పటి వరకు తదుపరి సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. కేజీఎఫ్‌ కు ఏమాత్రం తగ్గకుండా ఉండే విధంగా యశ్‌ స్క్రిప్ట్‌ కోసం చూస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.