Begin typing your search above and press return to search.

#రాకింగ్ బీట్.. స‌ల్మాన్ భాయ్ మెప్పు పొందిన దేవీశ్రీ‌

By:  Tupaki Desk   |   26 April 2021 2:30 AM GMT
#రాకింగ్ బీట్.. స‌ల్మాన్ భాయ్ మెప్పు పొందిన దేవీశ్రీ‌
X
బాలీవుడ్ కండ‌ల హీరో సల్మాన్ ఖాన్ న‌టించిన `రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్` థియేర్ల‌తో పాటు ఓటీటీలో సైమ‌ల్టేనియ‌స్ గా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. 13 మే ఈద్ కానుక‌గా రిలీజ్ అంటూ భాయ్ ట్రైల‌ర్ లో మ‌రోసారి అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఇటీవ‌లే రాధే ట్రైల‌ర్ రిలీజై అభిమానుల్లోకి దూసుకెళ్లింది. యాక్ష‌న్ ప్యాక్డ్ ట్రైల‌ర్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఇక ఇందులో ప్ర‌భుదేవా మార్క్ గ్లింప్స్ కి కొద‌వేమీ ఉండ‌ద‌ని భావిస్తే ఇదే ట్రైల‌ర్ లో దేవీశ్రీ మార్క్ సీటీమార్ సాంగ్ మెరుపులు మెరిపించింది. కొన్ని సెక‌న్ల నిడివితో ట్రైల‌ర్లో ఎంతో ప్రాధాన్య‌త‌నిచ్చి సీటీమార్ సాంగ్ బిట్ ని చూపించారు.

ఈ పాట‌కు స‌ల్మాన్ భాయ్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని దేవీశ్రీ బాణీ క‌ట్టార‌ట‌. అల్లు అర్జున్ నటించిన `దువ్వాడ జగన్నాధం` కోసం 2017 లో ఒరిజినల్ సాంగ్ కంపోజ్ చేసింది దేవీశ్రీ‌నే. రాక్ స్టార్ అద‌ర‌గొట్టాడ‌ని అప్ప‌ట్లోనే టాక్ వ‌చ్చింది. ఆ పాట చార్ట్ బ‌స్ట‌ర్ల‌లో నిలిచింది. ఇప్పుడు స‌ల్మాన్ ఇమేజ్ కి త‌గ్గ‌ట్టు దానిని రీక్రియేట్ చేశాడు దేవీ. అక్క‌డా భాయ్ మెప్పు పొందాడ‌ట‌.

పాట‌ ఆత్మ చెడ‌కుండా సంగీతం ఇచ్చాను. భాయ్ నన్ను పిలిచి పాట ఎంత‌ అద్భుతంగా అనిపిస్తోందో తన అభిప్రాయాన్ని ఆనందంగా పంచుకున్నార‌ని దేవీశ్రీ చెప్పారు. ఈ పాటను ప్రేక్షకులు కూడా మెచ్చుకుంటారని అన్నారు. ఇంత‌కుముందు కూడా స‌ల్మాన్ కి దేవీశ్రీ సంగీతం అందించారు. రెడీ చిత్రం నుండి `ధింక చికా..` పాటను భాయ్ కి అందించాడు. ఇప్పుడు సీటీమార్ తో మ‌రోమారు భాయ్ మెప్పు పొందాడు. ఈ పాట‌ను షబ్బీర్ అహ్మద్ ఆల‌పించ‌గా.. కమల్ ఖాన్ - లూలియా వంతూర్ రాశారు. పూర్తి పాటను ఏప్రిల్ 26 న విడుదలచేస్తారు.