Begin typing your search above and press return to search.

రోబో సీక్వెల్.. ఇక మొదలవ్వడమే లేటు

By:  Tupaki Desk   |   3 Sep 2015 6:50 AM GMT
రోబో సీక్వెల్.. ఇక మొదలవ్వడమే లేటు
X
శంకర్‌ దర్శకత్వం లో రోబో 2 ఎప్పుడు మొదలవుతోంది? ఇదిగో పులి అంటే అదిగో మేక అన్న చందం గా ఉంది ఈ వ్యవహారం. మెగాస్టార్‌ చిరంజీవి 150వ ప్రాజెక్టులానే ఈ సినిమా కూడా వాయిదాల పద్ధతిలో సాగుతూనే ఉంది. ఇప్పటికే రజనీకాంత్‌ పి.ఎ.రంజిత్‌ దర్శకత్వంలో 'కబాలి' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యే సరికి ఈ ఏడాది చివరి కి వెళ్లిపోతుంది. కాబట్టి రోబో 2 సీక్వెల్‌ ఈ ఇయర్ లోనే ఉంటుందని చెబుతున్నారు.

రోబో 2 రచయిత బి.జేయ మోహన్‌ చెప్పిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం స్క్రిప్టు ఫైనల్‌ అయ్యింది. ఈ సీక్వెల్‌ 2010 లో రిలీజైన రోబోకి కంటిన్యూషన్‌ పార్ట్‌. కథ ఎక్కడ ఎండ్‌ అయ్యిందో అక్కడి నుంచే మొదలవుతుంది. 2015 చివరిలో సెట్స్‌ కెళుతోంది. తలైవార్‌ అప్పటికి సిద్ధం గా ఉంటారు' అని చెప్పారు.

ఈ చిత్రంలో విక్రమ్‌ నటిస్తున్నారా? లేదా? అన్న ప్రశ్నకు .. ప్రస్తుతానికైతే రజనీ మాత్రమే ఎంపికయ్యారు. మిగతా కాస్టింగ్‌ వివరాలు త్వరలోనే తెలుస్తాయని జేయ మోహన్‌ చెప్పారు. కమల్‌ హాసన్‌ పాపనాశం తర్వాత జేయమోహన్‌ ఈ చిత్రానికి స్క్రిప్టు అందిస్తున్నారు. ఎట్టకేలకు రోబో 2 విషయంలో రచయిత ఓ క్లారిటీ ఇచ్చారు. ఇక కథ ఎలాంటిది? అన్నది రివీలయ్యే ఛాన్సుందేమో చూడాలి.