Begin typing your search above and press return to search.

2.0 టీజర్ అప్పుడే

By:  Tupaki Desk   |   4 Jan 2018 10:00 AM IST
2.0 టీజర్ అప్పుడే
X
ఇండియలోనే మొట్టమొదటి సారిగా అత్యధిక బడ్జెట్ తో నిర్మించిన సినిమా రజినీ కాంత్ 2.0. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం దాదాపు 450 కోట్లు ఖర్చుచేశారు. ఇకపోతే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని భారతదేశ సినీ లోకం ఎదురుచూస్తోంది. తెలుగు తమిళ్ హిందీ భాషల్లోనే కాకుండా అరబిక్ భాషలో కూడా ఈ 2.0 రిలీజ్ అవుతోంది. పూర్తిగా 3D టెక్నాలజీతో రూపొందిన ఈ సినిమా కోసం చాలా థియేటర్స్ ఇప్పటికే 3D స్క్రీన్స్ గా మారాయి.

ఇక అసలు విషయనికి వస్తే.. సినిమా అసలైన హంగామా జనవరి 6 నుంచి మొదలవ్వనుంది. ఎందుకంటే ఆ రోజే సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని భాషల్లో టీజర్ విడుదల కానుంది. ఇక సినిమా విడుదల విషయనికి వస్తే.. గత కొంత కాలంగా రిలీజ్ డేట్ పై అనేక రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. మొదట జనవరి 26న రిలీజ్ కానుంది అని టాక్ వచ్చింది కానీ అధికారికంగా చిత్ర యూనిట్ ఫైనల్ చేయలేదు. అయితే రీసెంట్ గా రజినీ కాంత్ అభిమానులతో జరిపిన మీటింగ్ లో సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశాడు.

2.0 సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోందని రజినీకాంత్ ఫైనల్ చేయడంతో సస్పెన్స్ కి తెరపడింది. ప్రస్తుతం VFX పనులు చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్లే సినిమా లెట్ అయ్యిందని చిత్ర యూనిట్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక సినిమాను విడుదల చేయడానికి నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ ఇప్పటి నుంచే భారీ ఏర్పాట్లను చేసుకుంటోంది. మరి సమ్మర్ లో సినిమా ఏ స్థాయిలో కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి.