Begin typing your search above and press return to search.

రోబో ఫస్ట్ లుక్ కి డేట్ ఇచ్చేశారు

By:  Tupaki Desk   |   11 Oct 2016 4:03 AM GMT
రోబో ఫస్ట్ లుక్ కి డేట్ ఇచ్చేశారు
X
సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి సంచలనాలు ఇప్పుడు పూర్తయిపోయాయి. ఇక రజినీ నెక్ట్స్ మూవీ కోసం జనాలు ఇంట్రెస్టింగ్ వెయిటింగ్ చేసేస్తున్నారు. శంకర్ డైరెక్షన్ లో రోబోకి సీక్వెల్ గా 2.0ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఈ మూవీలో రజినీ ఎలా ఉండబోతున్నారు? దాదాపు 350కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమా విజువల్ గా ఎలా ఉండనుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు రానుందో తెలిసిపోయింది.

తెలుగు.. హిందీ.. తమిళ్.. భాషలతో పాటు పలు భాషల్లో రూపొందనున్న 2.0 శరవేగంగా కాకపోయినా.. చెప్పుకోదగిన స్పీడ్ లోనే షూటింగ్ జరుపుకుంటోంది. అయితే.. ఈ ఏడాది జూన్ నుంచి 2.0 షూటింగ్ కి బ్రేక్ పడింది. రజినీ అనారోగ్యం కారణంగా ఆగిపోయిన షూటింగ్.. రీసెంట్ గా స్టార్ట్ కాగా.. ఇప్పుడీ చిత్రానికి ఫస్ట్ లుక్ ని రివీల్ చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. నవంబర్ 20న రజినీకాంత్ లేటెస్ట్ మూవీకి ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు.

ముంబైలో ఓ గ్రాండ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి.. ఫస్ట్ లుక్ ను రివీల్ చేయనున్నాడు దర్శకుడు శంకర్. ఈ కార్యక్రమానికి రజినీ సహా చిత్ర తారాగణమంతా హాజరు కానున్నారు.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/