Begin typing your search above and press return to search.

ఆ బాహుబలి రికార్డు పై కన్నేసిన 2.0!

By:  Tupaki Desk   |   20 Nov 2018 1:14 PM GMT
ఆ బాహుబలి రికార్డు పై కన్నేసిన 2.0!
X
సూపర్ స్టార్ రజనీకాంత్ - అక్షయ్ కుమార్- శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న '2.0' మరో పది రోజుల్లోపే విడుదలకు సిద్ధం అవుతోంది. భారీ బడ్జెట్.. స్టార్ కాంబినేషన్ లాంటి అట్రాక్షన్లు ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా భారీ ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే 'బాహుబలి' సినిమా రికార్డులను సవరించగలిగే సత్తా ఈ సినిమాకు ఉందని ఇప్పటికే కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దానికి తగ్గట్టే '2.0' మొదటి రికార్డుకు రంగం సిద్ధం అవుతోందని సమాచారం. 'బాహుబలి' ని రిలీజ్ చేసినట్టే ఈ సినిమాను కూడా వివిధ భాషలలో విడుదల చేస్తున్నారు. థియేటర్ల సంఖ్య 'బాహుబలి 2' కంటే ఎక్కువగా ఉండబోతోందని సమాచారం. అన్ని భాషలలో డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే దీనికోసం ఏర్పాట్లు చేసి పెట్టారట. ఈలెక్కన '2.0' థియేటర్ల సంఖ్యలో 'బాహుబలి' ని అధిగమించి మొదటి రికార్డును నెలకొల్పబోతోందట. ఇక అడ్వాన్సు బుకింగులు.. ఫస్ట్ డే కలెక్షన్స్ లాంటివి తర్వాత రాబోయే సంగతులు.

ఇప్పటికే ఈ సినిమా టీజర్.. ట్రైలర్లతో భారీ విజువల్ ఎఫెక్ట్స్ హంగామా ఉంటుందని.. 3D లో ప్రేక్షకులు సినిమాను చూసి థ్రిల్ అవుతారని దర్శకుడు శంకర్ నమ్మకంగా చెబుతున్నాడు. ఇక చిట్టి రోబోగా రజనీకాంత్.. విలన్ గా అక్షయ్ కుమార్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో చూడాలంటే మనం నవంబర్ 29 వరకూ వేచి చూడాలి.