Begin typing your search above and press return to search.

బాహుబ‌లి రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన '2.0'?

By:  Tupaki Desk   |   10 Sep 2018 10:43 AM GMT
బాహుబ‌లి రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన 2.0?
X
టాలీవుడ్ స్టామినాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాటి చెప్పిన సినిమా బాహుబ‌లి. తెలుగోడి స‌త్తాను ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి మిగ‌తా ఇండ‌స్ట్రీల‌కు ప‌రిచ‌యం చేశాడు. రెండు భాగాలుగా విడుద‌లైన బాహుబ‌లి కోసం నిర్మాత‌లు కూడా భారీ బ‌డ్జెట్ పెట్టారు. దాదాపు 450 కోట్లు వెచ్చించి తెర‌కెక్కించిన రెండు భాగాలు....1000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేశాయి. ఇండియ‌న్ ఫిల్మ్ హిస్ట‌రీలో అత్యంత ఖ‌రీదైన చిత్రంగా బాహుబ‌లి రికార్డుల‌కెక్కింది. స‌మీప భ‌విష్య‌త్తులో ఇంత భారీ బ‌డ్జెట్ తో మ‌రో సినిమా రావ‌డం క‌ష్ట‌మ‌ని ట్రేడ్ విశ్లేష‌కులు అనుకున్నారు. అయితే, శంక‌ర్ - ర‌జ‌నీ ల కాంబోలో తెర‌కెక్కుతోన్న `2.0` ....ఆ రికార్డును బ‌ద్ద‌లు కొట్టింద‌ని ఆ చిత్ర నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.


రోబో హిట్ కాంబోలో తెర‌కెక్కుతోన్న `2.0` త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. భారీ గ్రాఫిక్స్ తో తెర‌కెక్కిన ఈ సినిమా కోసం భారీ బ‌డ్జెట్ ఖ‌ర్చుపెట్టార‌ట‌. గంటన్నర నిడివి ఉన్న ఈ చిత్రానికి 525 కోట్లకి పైగా ఖర్చు అయిందని ఆ చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. అయితే, ఈ చిత్ర నిర్మాణానికి అయిన ఖ‌ర్చులో గ్రాఫిక్స్ వ‌ర్క్ కే ఎక్కువైంద‌ని టాక్. ఈ చిత్రం విడుద‌లలో జాప్యం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఒక కంపెనీకి ఇచ్చిన గ్రాఫిక్స్‌ కాంట్రాక్ట్‌ ని పూర్తి చేయకముందే ఆ కంపెనీ దివాలా తీసింది. దీంతో, వేరే కంపెనీలకి ఫ్రెష్ కాంట్రాక్ట్‌ ఇచ్చి ఆ వ‌ర్క్ పూర్తి చేశారు. అందుకే, చాలా నెల‌ల స‌మ‌యం వృథా అయి విడుద‌ల ఆల‌స్య‌మైంది. అయితే, ఆ ఆల‌స్యానికి గానూ అయిన వ‌డ్డీలు - అస‌లు క‌లుపుకొని 525 కోట్లు ఖ‌ర్చ‌య్యాయా...లేకుంటే...నార్మ‌ల్ గానే అయ్యాయా అన్న‌దానిపై క్లారిటీ లేదు. కానీ, భారతీయ చిత్ర పరిశ్రమ లోనే అత్యంత ఖరీదైన చిత్రం ఇదని పబ్లిసిటీ జరుగుతోంది. బ‌డ్జెట్ సంగ‌తి అలా ఉంచితే....బాహుబలి కలెక్ష‌న్ల రికార్డుల‌ను త‌లైవా అందుకుంటాడా లేదా అన్న‌ది వేచి చూడాలి