Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: 2.0.. ఈ ప్రపంచం మనుషులకే కాదు

By:  Tupaki Desk   |   20 Nov 2016 3:25 PM GMT
ఫస్ట్ లుక్: 2.0.. ఈ ప్రపంచం మనుషులకే కాదు
X
సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి సినిమా ''2 పాయింట్ 0'' ఎలియాస్ ''2.0''. అత్యుత్తమ కమర్షియల్ సినిమాల దర్శకుడు శంకర్.. ఇప్పుడు తాను రజనీ సార్ తో తీసిన ''రోబో'' సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించాడు. ఈ ఆదివారం సాయంత్రం సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల ముంబయ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. ఇంతకీ ఈ తొలిచూపు ఎలా ఉందో చూద్దాం పదండి.

మనం ఆల్రెడీ ''రోబో'' సినిమాలో చూసిన చిట్టి రోబో ఉందిగా.. ఇప్పుడు అదే రోబోతో మరో రోబో తలపడితే ఎలా ఉంటుంది? అచ్చం ఏదో కాకి మనిషిలా ఉన్న హీరో అక్షయ్ కుమార్ ఉన్నాడు చూడండి.. మనోడు సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఇప్పుడు విలన్ గా నటిస్తున్నాడు. అదిగో ఈ ప్రపంచం కేవలం మనుషలకే కాదు.. అంటే 'మా రోబోలకు కూడా' అన్న మీనింగ్ వచ్చేలా సినిమాను రూపొందించాడట శంకర్. అందుకే పోస్టర్లలో కూడా అదే చూపిస్తున్నారు. ఏకంగా ఏదో హాలీవుడ్ సినిమాను చూస్తున్నట్లు ఉంది కదూ ఈ పోస్టర్లను చూస్తుంటే.

ముంబయ్ లో జరిగిన ఈ ఫస్ట్ లుక్ లాంచింగ్ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ చీఫ్‌ గెస్ట్ అయితే.. రజనీతో పాటు శంకర్, అక్షయ్ కుమార్ - ఏ.ఆర్.రెహ్మాన్ - యామీ జాక్సన్ తదితరలు విచ్చేశారు. అంతే కాదు.. ఈ కార్యక్రమాన్ని స్వయంగా దర్శకనిర్మాత కరణ్‌ జోహార్ హోస్ట్ చేశాడు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/