Begin typing your search above and press return to search.

డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో మాస్టర్ స్టోరీ టెల్లర్..!

By:  Tupaki Desk   |   28 July 2021 11:30 AM GMT
డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో మాస్టర్ స్టోరీ టెల్లర్..!
X
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' (రౌద్రం రణం రుధిరం) చిత్రం కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. ఓవైపు షూటింగ్ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి అండ్ టీమ్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది.

'ఆర్ ఆర్ ఆర్' చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్లు పోస్టర్లు విశేష స్పందన తెచ్చుకున్నాయి. అలానే ఈ సినిమా వెనుక ఎందరి కష్టం ఉందనేది చూపిస్తూ ఇటీవల విడుదల చేసిన 'రోర్ ఆఫ్ RRR' మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియట్ చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా 'రోర్ ఆఫ్ RRR' ఒరిజినల్ సౌండ్ ట్రాక్(OST) ని ఇండియాలోని పాపులర్ మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికి ఎం ఎం కీరవాణి అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేయగా.. ప్రముఖ ర్యాపర్ బ్లేజ్ ఆలపించారు. బ్లేజ్ మరియు ఆదిత్య అయ్యంగార్ కలిసి ర్యాప్ లిరిక్స్ అందించారు. సంగీత దర్శకులు అచ్చు రమణి - జీవన్ బాబు దీనికి ప్రోగ్రామింగ్ చేశారు.

ఇకపోతే 'RRR'' చిత్రంలోని ''దోస్తీ'' అనే ఫస్ట్ సాంగ్ ను ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఆగస్టు 1న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ వంటి 5 ప్రధాన భారతీయ భాషల్లో 5 గురు పాపులర్ సింగర్స్ ఈ పాటను పాడటం విశేషం. తెలుగు వెర్సన్ కి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా.. సింగర్ హేమచంద్ర ఆలపించారు. ఇతర భాషల్లో అనిరుధ్ రవిచంద్రన్ - అమిత్‌ త్రివేది - విజయ్‌ ఏసుదాసు - యాజిన్ నజీర్‌ ఈ గీతాన్ని ఆలపించారు.

మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి RRR షూటింగ్ - పోస్ట్ ప్రొడక్షన్ చూసుకుంటూనే.. తన సినిమా ప్రమోషన్స్ కూడా పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో ముందుకు వెళ్లనున్నారు. పలు ప్రధాన నగరాల్లో స్పెషల్ ఈవెంట్స్ చేయడంతో పాటుగా టీవీ ఛానల్స్ ద్వారా ప్రచారం మొదలు పెట్టనున్నారు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబడుతున్న ఈ సినిమాకి అన్నీ భాషల్లో ఒకే విధమైన ప్రమోషన్ స్ట్రాటజీని ఫాలో అవుతారని తెలుస్తోంది.

కాగా, ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ - హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌ - శ్రియ - సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. కె కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ అందించిన కథకు.. బుర్రా సాయి మాధవ్ సంభాషణలు రాశారు. డీవీవీ పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'బాహుబలి' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.