Begin typing your search above and press return to search.

మెగాస్టార్ `ఆచార్య‌`పై మ‌రో బాంబు

By:  Tupaki Desk   |   11 Jan 2022 8:00 AM IST
మెగాస్టార్ `ఆచార్య‌`పై మ‌రో బాంబు
X
సినిమాల‌పై, అందులో వ‌చ్చే స‌న్నివేశాలు, పాట‌ల‌పై గ‌త కొంత కాలంగా విమ‌ర్శ‌లు, వివాదాలు జ‌రుగుతూనే వున్నాయి. కొంత మంది త‌మ మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయంటూ స‌ద‌రు సినిమాల‌పై కోర్టులకెక్క‌డం.. పోలీస్ కంప్లైంట్ లు ఇవ్వ‌డం జ‌రుగుతూనే వుంది. ఇటీవ‌ల యంగ్ టైగ‌ర్ ఎన్టీఅర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన `ఆర్ ఆర్ ఆర్‌` లో అల్లూరి సీతారామ రాజు, కొమ‌రం భీం పాత్ర‌ల‌ని కించ‌ప‌రిచార‌ని, చ‌రిత్ర‌ని వ‌క్రీక‌రిస్తూ వారి ఫాలోవ‌ర్స్ ని అవ‌మానించారంటూ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా స‌త్య‌వ‌ర‌పు ఉండ్రాజ‌వ‌రానికి చెందిన అల్లూరి సౌమ్య తెలంగాణ హై కోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాన్ని వేసిన విష‌యం తెలిసిందే.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆచార్య‌`పై తెలంగాణలోని జ‌న‌గామకు చెందిన ఆర్ ఎంపీ డాక్ట‌ర్ ల సంఘం పోలీస్ ల‌కు ఫిర్యాదు చేసింది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, రెజీనాల‌పై `శానా క‌ష్టం వ‌చ్చిందే మందాకినీ... `అంటూ సాగే ఓ ప్ర‌త్యేక గీతం వుంది. ఈ పాట‌లో ఆర్ ఎంపీ డాక్ట‌ర్ల‌ని అవ‌మాన ప‌రిచే ప‌దాలున్నాయ‌ని, వాటిని వెంట‌నే తొలిగించాల‌ని డిమాండ్ చేస్తూ తెలంగాణ‌లోని జన‌గామ‌కు చెందిన ఆర్ ఎంపీ డాక్ట‌ర్ల సంఘం ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌నం సృష్టించింది.

ఇది మ‌ర‌వ‌క ముందే తాజాగా `ఆచార్య‌` టీమ్ పై మ‌రో బాంబు ప‌డింది. తెలంగాణ ఆర్ ఎంపీ డాక్ట‌ర్ లు వ్య‌క్తం చేసిన అభ్యంత‌రాల్నే ఆంధ్ర ప్ర‌దేశ్ లోని తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన ఆర్ ఎంపీ డాక్ట‌ర్లు `ది బేసిక్ మెడిక‌ల్ ప్రాక్టీష‌న‌ర్స్ అసోసియేష‌న్ రాస్ట్ర అధ్య‌క్షుడు లంక స‌త్యానారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ముందు ధ‌ర్నా నిర్వ‌హించారు. `ఆచార్య‌` సినిమా లోని `శానా క‌ష్టం వ‌చ్చిందే మందాకినీ.. పాట‌లో ఆర్ ఎంపీ డాక్ట‌ర్లు మ‌హిళ‌ల‌ను వైద్యం పేరుతో ఎక్క‌డెక్క‌డ నిమ‌ర‌చ్చనే అస‌భ్య‌క‌ర‌మైన ప‌దాలున్నాయ‌ని, వాటిని వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు.

సినిమాలో వివాదంగా మారిన పాట‌ని ర‌చయిత భాస్క‌ర భ‌ట్ల ర‌వికుమార్ రాశారు. ఈ వివాదంపై మేక‌ర్స్ ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ లేదు. తాజా వివాదంపై అయినా స్పందిస్తారేమో చూడాలి. ఇదిలా వుంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన `ఆచార్య‌` ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల కానుంది. అయితే తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో చాలా వ‌ర‌కు సినిమాల రిలీజ్ డేట్ లు మారుతున్నందుకు ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా మారే అవ‌కాశం వుంద‌ని తాజాగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది. ఇక మెగాస్టార్ కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, మ్యాటినీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌ పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డిల‌తో కాలిసి రామ్ చ‌ర‌ణ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.