Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ ను తప్పుబట్టిన రోజా భర్త

By:  Tupaki Desk   |   10 Feb 2020 8:50 PM IST
సూపర్‌ స్టార్‌ ను తప్పుబట్టిన రోజా భర్త
X
ప్రస్తుతం తమిళనాట ‘దర్బార్‌’ వివాదం కొనసాగుతుంది. ఈ చిత్రాన్ని 150 కోట్లకు నిర్మాతలు అమ్మగా కేవలం 100 కోట్ల షేర్‌ మాత్రమే రాబట్టిందట. బయ్యర్లు దాదాపుగా 50 కోట్ల నష్ట పోయామని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగుతున్నారు. నిర్మాణ సంస్థ బయ్యర్ల బాధను పట్టించుకోవడం లేదు. దాంతో వారు చిత్ర హీరో మరియు దర్శకుడు అయిన రజినీకాంత్‌ మరియు మురుగదాస్‌ ల వెంట పడుతున్నారు. రజినీకాంత్‌ ను కలిసేందుకు ప్రయత్నిస్తే వీలు పడలేదు. మురుగదాస్‌ ను కలిసేందుకు వారు ప్రయత్నించారు.

మురుగదాస్‌ పై బయ్యర్లు తాజాగా కోర్టుకు వెళ్లారు. తమకు అన్యాయం చేశాడంటూ మురుగదాస్‌ పై ఫిర్యాదు నమోదు చేయడం జరిగింది. దర్శకుడు మురుగదాస్‌ తనకు బయ్యర్ల నుండి రక్షణ కావాలంటూ హైకోర్టుకు వెళ్లిన విషయం కూడా తెలిసిందే. ఈ సమయంలోనే తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడు అయిన మన ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమని స్పందించాడు. తమ సంఘం సభ్యుడు అయిన మురుగదాస్‌ ను కాపాడుకుంటామని.. ఆయన వెంటన దర్శకుల సంఘం ఉందని ప్రకటించాడు.

సినిమా లాభ నష్టాలకు హీరో.. దర్శకులకు సంబంధం ఏంటీ అంటూ సెల్వమణి ప్రశ్నించాడు. బయ్యర్లు సినిమాను కొనుగోలు చేసే సమయంలోనే కాస్త జాగ్రత్త గా ఉండాలని.. సినిమాకు లాభాలు వస్తే దర్శకుడికి ఏమైనా ఇస్తారా అంటూ ప్రశ్నించాడు. నష్టపోయిన బయ్యర్ల కు తిరిగి డబ్బులు ఇచ్చే విధానంను తీసుకు వచ్చినందుకు ఈ సందర్బంగా రజినీకాంత్‌ పై కూడా సెల్వమని విమర్శలు గుప్పించాడు.

ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీ లో ఉన్న ఈ పరిస్థితికి కారణం రజినీకాంత్‌ అంటూ ఆరోపించాడు. ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్లీ మళ్లీ ఇవ్వాల్సిందే అంటూ బయ్యర్లు డిమాండ్‌ చేయడం కామనే అని.. కాని ఈ వివాదంలోకి టెక్నీషియన్స్‌ ను లాగడం కరెక్ట్‌ కాదని దర్శకుల సంఘం అధ్యక్షుడి హోదాలో దర్బార్‌ బయ్యర్లపై సెల్వమని ఫైర్‌ అయ్యాడు.