Begin typing your search above and press return to search.

షీనా బోరా.. ఇక సినిమాగా మారనుంది

By:  Tupaki Desk   |   16 Sep 2015 7:30 AM GMT
షీనా బోరా.. ఇక సినిమాగా మారనుంది
X
నిజ‌జీవితాల్ని వెండితెర‌కెక్కించ‌డంలో బాలీవుడ్ ద‌ర్శ‌కుల త‌ర్వాతే. రియ‌ల్ ఇన్సిడెంట్ల ఆధారంగా గ్రిప్పింగ్ స్ర్కీన్‌ ప్లే తో ఆక‌ట్టుకోవ‌డం వాళ్ల‌కే చెల్లింది. అప్ప‌ట్లో ఏక్తా క‌పూర్ డ‌ర్టీ పిక్చ‌ర్ ని నిర్మించి టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. ఆ త‌ర్వాత హేట్ స్టోరీ సిరీస్‌ లో సినిమాల‌న్నీ రియ‌ల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెర‌కెక్కి సంచ‌ల‌నం అయ్యాయి. ఇవ‌న్నీ నిజ‌జీవితాల‌ ఆధారంగా తెర‌కెక్కిన చిత్రాలే. ఇప్పుడు మ‌రో నిజ‌జీవితం తెర‌కెక్కుతోంది.

షీనా బోరా మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ త్వరలోనే ఆన్‌ సెట్స్‌ కి వెళుతోంది ఇదో బెంగాళీ కమ్‌ హిందీ మూవీ. ఈ చిత్రంలో మంచు హీరోయిన్ రియాసేన్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. మంచు మ‌నోజ్ స‌ర‌స‌న నేను మీకు తెలుసా చిత్రంలో న‌టించింది రియా సేన్‌. క్యూట్ లుక్స్‌, హాట్ అప్పియ‌రెన్స్‌ తో ఎవ‌రీ అమ్మ‌డు? అన్న టాక్ తెచ్చుకుంది. అయితే తొలి సినిమా ఫ్లాప‌వ్వ‌డంతో తెలుగులో ఆశించిన‌న్ని అవ‌కాశాలు రాలేదు. ఆ త‌ర్వాత బాలీవుడ్‌ కే ప‌రిమిత‌మైంది ఈ బ్యూటీ. సంచ‌ల‌నం సృష్టించిన షీనా బోరా హ‌త్యోదంతంతో అగ్నిదేవ్ ఛ‌ట‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ థ్రిల్ల‌ర్ తెర‌కెక్క‌నుంది. షీనా బోరా పాత్ర‌లో రియా న‌టిస్తోంది. ఈనెల 27 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. గౌహ‌తి - క‌ల‌క‌త్తా - ముంబై - లొకేష‌న్ ల‌లో చిత్రీక‌ర‌ణ చేయ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

ఒక స్టార్ హీరోయిన్ త‌న‌యురాలిగా సినీప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించిన రియాసేన్ బాలీవుడ్‌ లో ఆశించినంత పెద్ద స్టార్ కాలేక‌పోయింది. ఇటీవ‌లి కాలంలో సినిమాల్లేక శికార్ల‌తోనే కాల‌క్షేపం చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ భామ లండ‌న్‌ లో శికారు చేస్తుంటే వ‌ల‌వేసి ప‌ట్టుకున్నాడు ద‌ర్శ‌కుడు ముఖ‌ర్జీ. వేట‌గాడే వ‌ల‌లో ప‌డినందుకు మంచి ఛాన్సే కొట్టేసింది అమ్మ‌డు! ప్చ్‌!!