Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఫుల్‌ కిక్కిచ్చేస్తోంది 'బ్రా'బోయ్‌!!

By:  Tupaki Desk   |   24 May 2015 3:30 AM GMT
ఫోటో స్టోరి: ఫుల్‌ కిక్కిచ్చేస్తోంది బ్రాబోయ్‌!!
X
అసలు ఈ దివ్యరూపం మోనాలిసాకే మతిచెడేలా ఉంది కదూ? అసలింతకీ ఎవరీవిడ? అని సందేహం వస్తే కాస్త ఇంట్రడక్షన్‌ అవసరం. అప్పట్లో మంచు మనోజ్‌ ప్రయోగాత్మక చిత్రం 'నేను మీకు తెలుసా?' లో నటించింది. క్యూట్‌ లుక్స్‌తో మన కుర్రకారును కంగు తినిపించింది ఈ అమ్మడే. అయితే ఆ సినిమా ఫ్లాపవ్వడంతో తెలుగులో అవకాశాలే రాలేదు.

అలనాటి మేటి బాలీవుడ్‌ నటి సుచిత్ర సేన్‌కి మనవరాలు. మున్‌మున్‌ సేన్‌కి కూతురు. కథానాయిక రైమాసేన్‌కి చెల్లెలు. చూడగానే క్యూట్‌గా ఆకట్టుకునే ఈ అమ్మడి ఫ్యామిలీ అంతా నటీమణులే. పూర్తిగా ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌తో సినీరంగంలో ప్రవేశించింది. విషకన్య అనే సినిమాతో బాలనటిగా సినీఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత దాదాపు ఓ 30 సినిమాల్లో నటించేసింది. చివరిగా జిందగీ 50-50 (2012), రబ్బా మే క్యా కరో (2013) సినిమాల తర్వాత రియాసేన్‌ .. వేరొక సినిమాకి కమిటైందే లేదు. 2014లో జతీశ్వర్‌ అనే బెంగాళీ చిత్రంలో నటించింది. అయితే ఇప్పటికే హిందీ సినిమాలో నటించి రెండేళ్లయిపోయింది. 2015లో సినిమాయే లేదు.

ఇంత పెద్ద గ్యాప్‌ రావడానికి కారణమేంటో తెలియరాలేదు. అయితే ఇక్కడున్న ఫోటోలో రియా ఎంత గ్లామరస్‌గా కనిపిస్తుందో కదూ. ఉలి చెక్కిన శిల్పంలా కనిపిస్తోంది. గులాబి మధ్యలో ముడుచుకుపోయిన రేకులా కనిపిస్తోంది. అసలే సమ్మర్‌ సీజన్‌. కాస్త సేదతీరడానికి ఏదైనా తాగి రెస్ట్‌ తీసుకునే సీజన్‌. అయితే ఏం తాగకుండానే కిక్కిస్తోందీ ఈ అమ్మాడు 'బ్రా'బోయ్‌.