Begin typing your search above and press return to search.

​మనోజ్ హీరోయిన్ పెళ్లి కుదిరింది

By:  Tupaki Desk   |   16 Aug 2017 8:24 AM GMT
​మనోజ్ హీరోయిన్ పెళ్లి కుదిరింది
X

కొంతమంది హీరోయిన్లు వస్తారు చాలా కాలం ఉంటారు. కానీ పెద్దగా స్టార్ హీరోయిన్ కాకుండగానే సినిమాను వదిలి వెళ్లిపోతారు. సినిమా హీరోయిన్లు అయితే చిన్న వయసులోనే వస్తారు. కొంచం మంచి హిట్లు వస్తే ఎక్కువ కాలం ఉండటానికి ప్రయత్నం చేస్తారు లేకపోతే పెళ్లి కుదిరేవరకు ఏదో వచ్చిన సినిమాలు చేస్తూ ఉంటారు. ముంబాయి అమ్మాయి రియా సేన్ కూడా చిన్న వయసులోనే వచ్చిన అనుకున్నంత స్థాయిలో పేరు సంపాదించలేకపోయింది.

రియా సేన్ మన తెలుగులో కూడా హీరోయిన్ గా నటించింది. మంచు మనోజ్ హీరోగా చేసిన ‘నేను మీకు తెలుసా’ సినిమాలో ఒక హీరోయిన్ రియానే. ఆ సినిమాకు ఈమె అందానికి మంచి స్పందనే వచ్చిన ఆ తరువాత పెద్దగా ఆఫర్లు రాలేదు. దానితో హిందీలో కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఇప్పుడైతే ఏక్తా కపూర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఒక టి‌వి సీరియల్లో నటిస్తుంది. ఈ టి‌వి సీరియల్ రాగిణి ఎం‌ఎం‌ఎస్ సినిమా ఆదారంగా తీస్తునట్లు చెబుతున్నారు. అయితే ఈ36 ఏళ్ల హింది నటి తన బోయ్ ఫ్రెండ్ మరియు ఫొటోగ్రాఫర్ శివం తో ఎప్పటి నుండో ప్రేమలో ఉంది. ఇప్పటికీ వీళ్ళు పెళ్లి చేసుకొని ఒకటికావలినే నిర్ణయం తీసుకున్నారు. రియా సేన్ తన సినిమాలు కన్నా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. హాట్ ఫోటోలు పెడుతూ తన ప్రియుడుతో సరదా గడిపిన విశేషాలు చెబుతూ హడావిడి చేస్తూ ఉంటుంది.

ఇప్పుడు అయితే తన ఫొటోగ్రాఫర్ ప్రియుడు శివం తో పెళ్ళికి సిద్దమైంది. ఈ నెల తరువాత ఒక డేట్ ని ఖరారు చేసుకుంటాం అని కూడా చెబుతుంది రియా సేన్. ఈమెకు ఒక అక్క కూడా ఉంది. రైమా సేన్ అనే నటి కూడా రియా సేన్ లానే అంతగా ఫేమస్ కాలేకపోయింది. కొన్ని మంచి ప్రాంతీయ చిత్రాలలో నటించిన ఎందుకో ఈ అక్కచెల్లలుకు అంతగా గుర్తింపు రాలేదు.