Begin typing your search above and press return to search.

ఈ బికినీ బ్యూటీ మీకు తెలుసా?

By:  Tupaki Desk   |   25 March 2018 12:28 PM GMT
ఈ బికినీ బ్యూటీ మీకు తెలుసా?
X
సరిగ్గా పదేళ్ళ క్రితం మంచు మనోజ్ హీరోగా 'నేను మీకు తెలుసా' అనే సినిమా ఒకటి వచ్చింది. ఫ్లాప్ అయ్యింది లెండి. గజినీ తరహాలో మతిమరుపు కాన్సెప్ట్ ని ఆధారంగా చేసుకుని తీసిన ఆ మూవీలో హీరొయిన్ గా నటించింది రియా సేన్. ఆ మూవీ పెద్దగా ఆడకపోవడంతో బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. బోల్డ్ గా నటించడానికి ఏ మాత్రం మొహమాటపడని ఈ హాట్ అందాల భామ నిన్నటి తరం హీరొయిన్ మున్ మున్ సేన్ కూతురు. అక్కయ్య రైమా సేన్ కూడా హీరొయినే. తెలుగులో నితిన్ సరసన తేజ దర్శకత్వంలో 'ధైర్యం' అనే సినిమా చేసింది కాని అది కూడా డిజాస్టర్ కావడంతో తనకూ ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ ఇద్దరు మధ్య వయసు దాటేసినా మోడలింగ్ మాత్రం ఆపకపోవడం విశేషం.

పైన స్టిల్ చూసారుగా. బీచ్ ఒడ్డున రెండు చిన్న గుడ్డ పీలికల్లాంటి పీసులతో బికినీ కట్టుకుని కిరాక్ అనిపించే స్టిల్ చూస్తుంటే తన వయసు 37 అంటే నమ్మగలరా. ప్రస్తుతం తన చేతుల్లో పెద్ద సినిమా ఏది లేదు కాని బాలాజీ సంస్థ నిర్మిస్తున్న రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్ వెబ్ సిరీస్ లో నటించింది. సెన్సార్ లేని వీడియో కాబట్టి అందులో రెచ్చిపోయి నటించింది అనే టాక్ ఇప్పటికే బాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. గతంలో ఎన్నడు చూడని హాట్ సన్నివేశాలు అందులో ఉంటాయట. రియా సేన్ మాత్రం రాజీ పడే సమస్యే లేదంటోంది. ఎంత అడిగినా అందాలు ఆరబోస్తాను అంటున్న రియా సేన్ ని వాడుకోవడం దర్శక నిర్మాతలకే తెలియడం లేదు. అదే కనక జరిగితే ఈ మిడిల్ ఏజ్ సెక్సీ బ్యూటీ ని మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు.