Begin typing your search above and press return to search.

గోవా బీచ్ లో బికినీ అందాల మోత

By:  Tupaki Desk   |   5 Feb 2017 8:16 AM GMT
గోవా బీచ్ లో బికినీ అందాల మోత
X
బాలీవుడ్ బ్యూటీ రియా సేన్ కి ప్రస్తుతం చేతిలో హిందీ సినిమాలేమీ లేవు. మూన్ మూన్ సేన్ కూతురుగా.. రైమా సేన్ సోదరిగానే కాదు.. సొంతగా కూడా ఈ భామకు బోలెడంత క్రేజ్ ఉంది. అయితే.. బాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాక.. మూడేళ్లుగా బెంగాలీ సినిమాల్లోనే కనిపిస్తోంది రియాసేన్.

ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలేవీ లేవు కానీ.. రియా సేన్ మాత్రం అందాల ఎగ్జిబిషన్ లో ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు గోవాలో ఎంజాయ్ చేస్తోన్న రియాసేన్.. ఫ్రెండ్స్ తో కలిసి వెకేషన్ లో ఉంది. గోవా బీచ్ లలో బికినీ అందాలతో దిగిన ఫోటోలతో రచ్చ రచ్చ చేసేస్తోంది. 36 ఏళ్ల సుందరాంగి అయినా.. ఇంకా పడుచుపిల్లలా కనిపించడం ఈ అమ్మడి అసలైన ప్రత్యేకత. సహజంగా ఇలాంటి ఫోటోలు ఒకటో రెండో షేర్ చేస్తుంటారు. కానీ రియా సేన్ మాత్రం కుప్పలు తెప్పలుగా గోవా బీచ్ ల నుంచి బికినీల్లో ఫోటోలను పంచిపెట్టేస్తోంది.

తెలుగులో కూడా ఈ భామ ఒక సినిమాలో నటించింది. 'నేను మీకు తెలుసా?' అనే సినిమాలో మంచు మనోజ్ కి జోడీగా నటించింది ఈ భామ. కెరీర్ మొదట్లో తెలుగు-తమిళ్ లో కనిపించిన ఈ బ్యూటీ.. తర్వాత పూర్తిగా నార్త్ కే పరిమితం అయిపోయింది. గతేడాది హీరో 420.. డార్క్ చాకొలేట్ అంటూ రెండు బెంగాలీ చిత్రాల్లో దర్శనం ఇచ్చింది రియా సేన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/