Begin typing your search above and press return to search.
సోదరుడితో కలిసి ముంబైలో కొత్త ఇల్లు కోసం రియా సెర్చ్
By: Tupaki Desk | 4 Jan 2021 1:00 PM IST2020 ఆద్యంతం బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి బ్యాడ్ టైమ్ రన్ అయ్యింది. గత ఏడాది జూన్ లో తన ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణానికి పాల్పడిన కేసు తన మెడకు చుట్టుకుంది. హీరో సుశాంత్ విషాదకరమైన మరణం వల్ల రియా చక్రవర్తి చాలా పరీక్షలు ఎదుర్కొంటున్నారు. రియాను డ్రగ్స్ కేసులో ఎన్.సి.బి అరెస్టు చేసింది. అక్టోబర్ లో బెయిల్ పై విడుదలయ్యే వరకు బైకుల్లా జైలులో ఒక నెల పాటు గడిపింది. ఆ క్రమంలోనే రియా చక్రవర్తి తన సోదరుడు.. కుటుంబం మానసికంగా ఎంతో కుంగుబాటుకు లోనైంది.
కారణం ఏదైనా సుదీర్ఘ పోరాటం అనంతరం తనకు కోర్టులో ఊరట లభించింది. రియాను ఈ కేసులో పూర్తిగా దోషిని చేయలేదు. రియా సోదరుడికి బెయిల్ మంజూరైంది. ఇక ఈ కేసులో తుది ఫలితాన్ని వెలువరించేందుకు ఇంకా పాటుపడుతున్నామని ఇటీవలే సీబీఐ బహిరంగ ప్రకటన చేసిన సంగతి తెలిసినదే.
ప్రస్తుతం రియా 2021 కొత్త సంవత్సరాన్ని ఎలా ప్రారంభించనుంది? అంటే దానికి సమాధానం దొరికింది. సోమవారం ఉదయం రియా తన సోదరుడు షోయిక్ చక్రవర్తితో కలిసి బాంద్రాలో ఒక కొత్త ఇంటి కోసం వెతుకుతూ వీధిలో వెళుతున్నప్పటి ఫోటోలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు రియా తన తల్లిదండ్రులు ఇంద్రజిత్ - సంధ్య చక్రవర్తితో కలిసి ముంబై శాంటా క్రజ్ (వెస్ట్) లో నివసిస్తున్నారు. కానీ రియా కుటుంబం వారికి ఇంత కష్టం కలిగించిన చోట ఉండాలన్న మానసిక స్థితిలో లేనట్లు కనిపిస్తోంది. అందుకే కొత్త ఇంట్లో మానిసక శాంతిని కోరుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.