Begin typing your search above and press return to search.

సాంప్ర‌దాయాన్ని కాపాడుతున్న ఏకైక‌ తెలుగు నటి

By:  Tupaki Desk   |   9 Sep 2022 4:41 AM GMT
సాంప్ర‌దాయాన్ని కాపాడుతున్న ఏకైక‌ తెలుగు నటి
X
సోష‌ల్ మీడియా యుగంలో గ్లామర్ హ‌ద్దులు చెరిపేస్తోంది యువ‌త‌. ఇక గ్లామ‌ర్ రంగంలోకి దూసుకొచ్చిన చాలా మంది టాప్ మోడ‌ల్స్ అదుపు అన్న‌దే లేకుండా ఎక్స్ పోజ్ చేస్తూ షాక్ లిస్తున్నారు. ఇప్పుడు హాలీవుడ్ టాలీవుడ్ అన్న విభేధ‌మే లేదు. అన్నిచోట్లా ఒక‌టే ఎక్స్ పోజింగ్. ఏంజెలినా .. జెన్నిఫ‌ర్ కి లేడా గాగాకి అయినా ముచ్చెమ‌ట‌లు పోయాల్సిందే. అంత‌గా చెల‌రేగిపోతున్నారు ఆధునిక న‌టీమ‌ణులు. న‌వ‌నాయిక‌లు నిరంత‌రం వేడెక్కించే ఫోటోషూట్ల‌తో సోష‌ల్ మీడియాల్ని ఠారెత్తిస్తున్నారు.

కానీ అందుకు భిన్నంగా హైద‌రాబాదీ అమ్మాయి.. న‌టి రీతూవ‌ర్మ కొంత‌వ‌ర‌కూ సాంప్ర‌దాయ‌బద్ధ‌మైన రూపంతో క‌నిపిస్తోంది. రీతూ ఇన్ స్టాని ప‌రిశీలిస్తే స‌రిహ‌ద్దులు చెరిపేసే ఎక్స్ పోజింగ్ ను చూడ‌లేం.

కానీ మునుప‌టితో పోలిస్తే ఈ తెలుగ‌మ్మాయి కూడా అంతో ఇంతో ప‌ట్టు విడుపు ప్ర‌ద‌ర్శిస్తోంద‌న్న‌ది నిజం. తెలుగులో అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించ‌క‌పోయినా కానీ రీతూ త‌మిళంలో చియాన్ విక్ర‌మ్ లాంటి స్టార్ స‌ర‌స‌న న‌టించేసింది. మునుముందు తెలుగు-త‌మిళం-మ‌లయాళంలో బిజీ స్టార్ గా వెల‌గాల‌ని క‌లలుగంటోంది.

రీతూ ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ స‌హా యువ‌హీరోల స‌ర‌సన న‌టిస్తోంది. త‌న సినిమాల‌న్నీ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుండ‌గా వాటికి ప్ర‌చారం చేసేందుకు ప్లాన్ చేస్తోంది. సామాజిక మాధ్య‌మాల్లో వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ య‌వ‌త‌రాన్ని ఆక‌ట్టుకుంటోంది. రీతూ చీర‌లో సింపుల్ గా ఎంతో అందంగా క‌నిపిస్తున్న ఓ ఫోటోగ్రాఫ్ వైర‌ల్ గా మారింది. నిఖితా నారాయ‌ణన్ ఈ డిజైన‌ర్ శారీని రూపొందించారు.

వెర్స‌టైల్ హీరో శర్వానంద్ క‌థానాయ‌కుడిగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన‌ 'ఒకే ఒక జీవితం'లో రీతూ వర్మ కథానాయిక. న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లో రీతూ మెప్పించ‌నుంద‌ని స‌మాచారం.

ఈ సినిమాలో శర్వా తల్లిగా అమల అక్కినేని కనిపించనున్నారు. తెలుగు- తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్‌ఆర్‌ ప్రకాష్ బాబు- ఎస్ ఆర్‌ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.