Begin typing your search above and press return to search.

కోలీవుడ్‌లో పాగా వేస్తున్న తెలుగు నటి

By:  Tupaki Desk   |   17 March 2020 9:15 AM GMT
కోలీవుడ్‌లో పాగా వేస్తున్న తెలుగు నటి
X
'బాద్ షా' సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమై ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు నటి రీతూ వర్మ. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా నటించిన మలయాళ-తెలుగు ద్విభాషా చిత్రం 'కనులు కనులను దోచాయంటే' ఈ మధ్య విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం రీతూ వర్మకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. తెలుగులో అడపాదడపా చిత్రాలలో నటిస్తున్న రీతూ వర్మ మాలీవుడ్ మరియు కోలీవుడ్‌లో కూడా నెమ్మదిగా బిజీగా మారుతోంది.

'కనులు కనులను దోచాయంటే' విజయంతో మంచి ఉత్సాహంగా ఉన్న రీతూ వర్మ ప్రస్తుతం మరో తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం అంగీకరించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో హీరో తోపాటు చెఫ్ పాత్రలో రీతూ వర్మ కనిపించనుందని సమాచారం. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రానికి అని శశి దర్శకత్వం వహిస్తుండగా యువ తమిళ హీరో అశోక్ సెల్వన్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం ప్రధాన భాగం లండన్‌ లో చిత్రీకరించబడుతోంది. ఈ చిత్రం ద్వారా మరో విజయాన్ని సొంతం చేసుకొని తమిళ తెలుగు భాషల్లో బిజీగా మారిపోవాలని రీతూ వర్మ అభిమానులు ఆశిస్తున్నారు.