Begin typing your search above and press return to search.

ఆ అవార్డు హీరోయిన్ ని మార్చేసిందట

By:  Tupaki Desk   |   12 May 2017 5:39 AM GMT
ఆ అవార్డు హీరోయిన్ ని మార్చేసిందట
X
పెళ్లి చూపులు ఫేమ్ రీతు వర్మ ఇప్పుడు క్రేజీ హీరోయిన్ అయిపోయింది. తను ఎవరి పక్కన హీరోయిన్ గా చేయాలో కూడా డిసైడ్ చేసేసేకుంటోంది కూడా. గతంలో ఇచ్చిన కొన్ని కమిట్మెంట్స్ కు కూడా కుదరదని చెప్పేస్తోందంటే.. ఈ అమ్మడి క్రేజ్ అర్ధమవుతుంది. పెళ్లి చూపులు మూవీకి నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత పాత్రల ఎంపికలో మరింత కేర్ తీసుకుంటున్నానని అంటోంది రీతు వర్మ.

పెళ్లిచూపులు తర్వాత నిఖిల్ నటిస్తున్న కేశవ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది రీతు వర్మ. 'ఈ సినిమాలో నేను నిఖిల్ కి ప్రియురాలిగా కనిపిస్తాను. నా పాత్ర ఇండిపెండెంట్ మాత్రమే కాదు.. హీరో ప్రయాణంలో కీలకమైన జర్నీ కడా ఉంటుంది. ముందు నుంచి విభిన్నమైన జోనర్లలో సినిమాలు చేయాలన్నది నా ఆలోచన. దర్శకుడు చెప్పిన ఈ స్క్రిప్ట్ విపరీతంగా నచ్చేసింది. సుధీర్ వర్మ గత చిత్రం స్వామి రారా కూడా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో నడుస్తుంది. అప్పుడే ఆయనతో పని చేయాలని అనుకున్నాను. నాకు త్వరగానే కోరుకున్న అవకాశం వచ్చింది' అని చెప్పింది రీతు వర్మ.

సెలక్షన్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నానన్న రీతు వర్మ.. 'నాకు చాలా ఆఫర్లే వచ్చాయి. కానీ ఎంపికలో మాత్రం నాకు జాగ్రత్త ఎక్కువ. నన్ను ఇండిపెండెంట్ గాళ్ గా చూపించే పాత్రలనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలాంటివి నా రియల్ లైఫ్ కు దగ్గరగా ఉంటాయి. స్క్రిప్ట్ ఎంపిక విషయంలో నేషనల్ అవార్డ్ తర్వాత నాలో చాలానే మార్పులు వచ్చాయి' అని చెప్పింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/