Begin typing your search above and press return to search.

హీరోయిన్ గా కాకుండా.. నటిగా చూస్తున్నారు

By:  Tupaki Desk   |   15 Aug 2017 5:12 AM GMT
హీరోయిన్ గా కాకుండా.. నటిగా చూస్తున్నారు
X
కొన్ని సినిమాలు కొంతమంది నట జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒక్క హిట్ కొడితే పది ఫ్లాప్ సినిమాలకు సమాధానం దొరుకుతుంది మరో ఐదు సినిమాలకు అవకాశం కూడా వస్తుంది. ఇది ఒక్క హీరోలు విషయంలోనే కాదు ఇప్పుడు ఇప్పుడే హీరోయిన్లు అవుతున్న వారికి కూడా అప్లై చేసుకోవచ్చు. కిందటి ఏడాది వచ్చిన చిన్న సినిమా పెళ్లి చూపులు హీరో హీరోయిన్లు విషయంలోనూ అలానే జరిగింది. ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండ కూడా ఇప్పుడు మంచి బిజీ గా ఉన్నాడు. అలాగే పెళ్లి చూపులు హీరోయిన్ రీతూ వర్మ కూడా ఇప్పుడు తమిళ్ సినిమాలు చేస్తూ తన కెరియర్లోనే గొప్ప అవకాశం పట్టేసింది.

పెళ్లి చూపులు హిట్ అయిన తరువాత ఈ సినిమాను తమిళ్లో రీమేక్ చేస్తే బాగుంటుందిని డైరెక్టర్ గౌతమ్ మీనన్ రీమేక్ రైట్స్ కొనుక్కున్నారు. దానితో పాటుగా గౌతమ్ మీనన్ కొత్త సినిమా విక్రమ్ హీరోగా నటిస్తున్న ధృవ నక్షత్రం లో హీరోయిన్ కోసం చూస్తున్నారు. రీతూ వర్మ లుక్ టెస్ట్ వాళ్ళకు నచ్చడంతో ధృవ నక్షత్రం హీరోయిన్ గా చేసే అవకాశం కొట్టేసింది. ఆ ఆనందం అనుభవం ఒక మీడియా ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది “ నాకు విక్రమ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అలాగే గౌతమ్ మీనన్ సినిమాలో ప్రేమ అన్న చాలా ఇష్టం. పెళ్లి చూపులు వలన నాకు ఈ అవకాశం వచ్చినందుకు ఎంత హ్యాపీ గా ఉన్నానో చెప్పలేను. నా జీవితంలో ఇది ఒక అద్భుతం అని చెబుతుంది. ఇదంతా పెళ్లి చూపులు వలనే జరిగింది. నన్ను ఒక హీరోయిన్ గా కాకుండా ఒక నటిగా చూస్తున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది చెప్పింది. ధృవ నక్షత్రం సినిమా నుండి నేను చాలా నేర్చుకున్నా. ఇన్ని ఏళ్లుగా హీరోగా చేసిన స్టార్ హీరో విక్రమ్ తన చేయబోయే ప్రతి షాట్ కోసం ఎంత కష్టపడతారో నా కళ్ళతో చూశాను. సెట్ ఎలా ఉండాలో అనేది డైరెక్టర్ గౌతమ్ మీనన్ దగ్గర నుండి నేర్చుకున్న” అని చెప్పింది.

గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్న ధృవ నక్షత్రంలో హీరోగా విక్రమ్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంగీతం హారిస్ జయ రాజ్ అందిస్తున్నాడు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా వచ్చే ఏడాది మొదటి నెలలో విడుదల కావచ్చు.