Begin typing your search above and press return to search.

కాని.. స్కిన్‌ షో లేదంటూ రూల్ పెట్టిందా?

By:  Tupaki Desk   |   8 Aug 2016 5:30 PM GMT
కాని.. స్కిన్‌ షో లేదంటూ రూల్ పెట్టిందా?
X
కొత్త హీరోయిన్లు కావాలి. ఎందుకంటే ఉన్న అరకొర స్టార్ హీరోయిన్లలో కొందరు కెరియర్ అంతానికి దగ్గర్లో ఉన్నారు. మిగిలిన కొత్త భామలేమో ఆల్రెడీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందుకే ఇప్పుడు కొత్త నీరు కోసం టాలీవుడ్ ఉవ్విళ్ళూరుతోంది.

మొన్ననే పెళ్ళి చూపులు సినిమాతో ఇంప్రెస్ చేసింది హీరోయిన్ రీతూ వర్మ. అంతకంటే ముందు చాలా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసినా కూడా.. ఇప్పుడొచ్చినంత ఫేం అప్పుడు రాలేదు. అయితే అమ్మడు అడివి శేష్‌ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందనే విషయం ఆల్రెడీ చెప్పుకున్నాయం. కాని అక్కడే ఒక ట్విస్టుంది. ఖచ్చితంగా తాను పొట్టి బటలకు వ్యతిరేకం అని.. గ్లామర్ చిందించాల్సి వస్తే మాత్రం కష్టమని రూల్ పెట్టిందట ఈ సుందరి. మామూలుగా మన సినిమాల్లో గ్లామర్ చిందించకుండా స్టార్ హీరోయిన్ అయిపోయినోళ్ళు ఎవ్వరూ లేదు. ఈ సమయంలో చక్కగా తన హాట్ లుక్స్ తో క్యాష్‌ చేసుకోకుండా ఇలాంటి రూల్స్ తో ఛాన్సులను పోగొట్టుకుంటుందా అంటూ రీతు వర్మపై సందేహాలు వ్యక్తపరుస్తున్నారు సినిమా విశ్లేషకులు.

తక కొత్త సినిమాలపై కామెంట్లు చేయమని అడగ్గా.. ప్రస్తుతానికి ఇంకా పెళ్ళి చూపులు సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది రీతూ. చూద్దాం ఏం చేస్తుందో!!