Begin typing your search above and press return to search.

అయ్యో.. అంద‌మున్నా అవ‌కాశాలు లేవు

By:  Tupaki Desk   |   29 March 2018 5:30 PM GMT
అయ్యో.. అంద‌మున్నా అవ‌కాశాలు లేవు
X
2013లో వ‌చ్చిన ఎన్టీఆర్ ‘బాద్షా’ సినిమాలో హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌కి చెల్లిగా నటించింది రీతూ వ‌ర్మ‌. ఆ త‌ర్వాత చిన్న చిన్న పాత్ర‌లు చేసిన ఈ హైద‌ర‌బాదీ బ్యూటీకీ, మూడేళ్ల త‌ర్వాత 2016లో విడుద‌ల‌యిన ‘పెళ్లిచూపులు’ రితూకి మంచి బ్రేక్‌ని ఇచ్చింది. ఆ సినిమాలో హీరోగా న‌టించిన విజ‌య్ దేవర‌కొండ‌ - వ‌రుస అవ‌కాశాల‌తో తెలుగులోనే బిజీయెస్ట్ హీరోగా మారిపోతే - హీరోయిన్ రితూ వ‌ర్మ‌కి మాత్రం ఒక్క తెలుగు సినిమా కూడా చేతుల్లో లేదు.

‘పెళ్లి చూపులు’ చిత్రం త‌ర్వాత నిఖిల్ స‌ర‌స‌న ‘కేశ‌వ‌’ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది రితూ వ‌ర్మ‌. మొద‌ట ఈ సినిమాలో హీరోయిన్‌గా క‌ల‌ర్ స్వాతిని ఎంచుకున్నా, చివ‌రి నిమిషంలో రితూకి ఆ అవ‌కాశం ద‌క్కింది. అయితే ఆ చిత్రం మొత్తం వ‌న్ మ్యాన్ షోగా మొత్తం హీరో నిఖిల్ చుట్టే తిర‌గ‌డంతో - రితూ పెద్ద‌గా చేయ‌డానికి ఏం లేక‌పోయింది. ఆ త‌ర్వాత ఈ తెలుగ‌మ్మాయిని ప‌ట్టించుకోలేదు ఒక్క తెలుగు ద‌ర్శ‌కుడు కూడా. త‌మిళంలో మాత్రం క్రేజీ అవ‌కాశాలు అందుకుంటోంది రీతూ. అక్క‌డ ఛియాన్‌ విక్ర‌మ్ స‌ర‌స‌న ధృవ‌న‌క్ష‌త్రం సినిమా చేస్తున్న రితూ - దుల్క‌ర్ స‌ల్మాన్ స‌ర‌స‌న ‘క‌న్నుమ్ క‌న్నుమ్ కొల‌యాడితాల్‌’ అనే సినిమాతో పాటు ‘ చిన్న’ అనే మ‌రో సినిమాలో న‌టిస్తోంది.

అందం, అభినయం... రెండూ క‌ల‌గ‌లిపిన రీతూ వ‌ర్మ‌ని మ‌న‌వాళ్లు ఎందుకు ప‌ట్టించుకోవ‌ట్లేదో అర్థం కావ‌ట్లేదు. బిందు మాధ‌వి - క‌ల‌ర్స్ స్వాతి వంటి తెలుగ‌మ్మాయిలు కూడా ఇక్క‌డ అవ‌కాశాలు రాక‌, కోలీవుడ్‌ లో స్టార్లు అయిన విష‌యం తెలిసిందే. రీతూ వ‌ర్మ కూడా అదే వ‌రుస‌లో న‌డుస్తోంది.