Begin typing your search above and press return to search.

పరికిణీ-ఓణీల్లోంచి చీరల్లోకి మారుతోంది

By:  Tupaki Desk   |   11 Oct 2016 7:00 PM IST
పరికిణీ-ఓణీల్లోంచి చీరల్లోకి మారుతోంది
X
రీతు వర్మ ఒక్కసారిగా ఫేమస్ హీరోయిన్ అయిపోయింది. గతంలో కూడా బాద్షా.. ప్రేమ ఇష్క్ కాదల్.. ఎవడే సుబ్రమణ్యం చిత్రాల్లో కనిపించినా.. పెళ్లి చూపులు తర్వాత ఈ అందాల భామ రేంజ్ బాగా మారిపోయింది. కొత్తోళ్లతో కాకుండా నెక్ట్స్ లెవెల్ హీరోలతో సినిమాలను మాత్రమే ఒప్పుకుంటోందంటే.. రీతు వర్మ స్పీడ్ అర్ధమవుతుంది.

ఎంత హీరోయిన్ అయినా.. తెలంగాణలో పుట్టిన మహరాష్ట్ర ఫ్యామిలీ అమ్మాయి. అందుకే పండగ పేరు చెబితే.. బోలెడన్ని కబుర్లు చెప్పేస్తోంది రీతు వర్మ. సినిమాల్లోకి రావడం కోసం.. ఇంజినీర్-డాక్టర్ల మాదిరిగానే నటించడం కూడా ఓ ప్రొఫెషన్ అని అమ్మానాన్నలను కష్టపడి ఒప్పించి.. వారు అర్ధం చేసుకునేలా చేసిందట. ఇప్పుడు అంత తీరిక లేకపోయినా.. గతంలో అయితే ఫ్రెండ్స్-అక్క మేఘలకు పోటీగా ముగ్గులు పెట్టేదిట రీతూ వర్మ. 9 రోజులు ఉపవాసం ఉంటామని.. దశమి రోజున వాహన పూజ చేస్తామని.. ఈ పండుగ టైంలో తమ కుటుంబం ఓ ప్రత్యేకమైన హోం చేస్తుంటుందని చెబుతోంది రీతు.

తనకు మామూలుగా అయితే జీన్స్ లాంటి వెస్ట్రన్ వేర్ సౌకర్యంగా ఉన్నా.. పండుగ రోజుల్లో మాత్రం పరికిణీ-ఓణీల్లోనే ఉండడం అలవాటు అంటోంది రీతు. ఈ మధ్యనే చీరలు కూడా ట్రై చేస్తున్నాని చెబుోతంది. మరి ఆ అమ్మవారిని ఏం కోరుకుంటావమ్మాయ్ అంటే.. పెళ్లి చూపుల్లాంటి సినిమాలు మరిన్ని చేసే ఛాన్స్ ఇవ్వమంటా అంటోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/