Begin typing your search above and press return to search.

బీర్ అండ్ భామతో పెళ్ళిచూపులు హీరో

By:  Tupaki Desk   |   9 May 2017 9:28 AM GMT
బీర్ అండ్ భామతో పెళ్ళిచూపులు హీరో
X
ఒక ప్రక్కన తన 'పెళ్ళిచూపులు' హీరోయిన్ రీతూ వర్మ. మరో ప్రక్కన చేతిలో బీర్. ఆ విధంగా పార్టీని ఎంజాయ్ చేస్తున్న హీరో విజయ్ సాయి దేవరకొండ. ''పెళ్లిచూపులు'' అనే నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాతో ఒక్కసారిగా సూపర్ పాపులర్ అయిపోయాడు ఈ కుర్రాడు. ఇప్పుడు ఇదిగో ఇలా పార్టీస్ లో కూడా రచ్చ చేస్తున్నారు.

గత రాత్రి జరిగిన పార్టీనో లేక వేరే ఎప్పుడైనా తీసిన ఫోటోనో తెలియదు కాని.. ''30 బీర్లతో నువ్వు బర్తడే సెలబ్రేట్ చేస్కో'' అంటూ తన సోషల్ మీడియాలో ఈ ఫోటోను షేర్ చేసింది రీతూ. ప్రస్తుతం కేశవ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న రీతూ.. అరడజను సినిమాలతో బిజీగా ఉన్న విజయ్.. ఇలా పార్టీలో తమ సినిమా తాలూకు జ్ఞాపకాలు నెమరేసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసినట్లున్నారు. పైగా ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ కూడా రావడం వీరికి ఇంకా కిక్కిచ్చి ఉంటుంది. ముప్పయ్ బీర్లు తాగినా ఆ అవార్డ్ తాలూకు కిక్ రాదులే.

ఇంతకీ ఈ పార్టీ ఎందుకు అనేగా మీ ప్రశ్న.. ఈరోజు విజయ్ దేవరకొండ తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడులే. అది సంగతి.