Begin typing your search above and press return to search.

‘గురు’వు గారి భామ రెచ్చిపోతోందిగా..

By:  Tupaki Desk   |   14 March 2017 8:17 AM GMT
‘గురు’వు గారి భామ రెచ్చిపోతోందిగా..
X
డాక్టర్ కాబోయి యాక్టర్ అంటుంటారు చాలామంది సెలబ్రెటీలు. ఐతే బాక్సర్ కాబోయి యాక్టర్ అయినవాళ్లు అరుదుగా ఉంటారు. ఆ జాబితాలోనే చేరుతుంది రితికా సింగ్. తమిళ-హిందీ భాషల్లో సూపర్ హిట్టయిన ‘ఇరుదు సుట్రు’కు ఈ అమ్మాయి పెర్ఫామెన్సే హైలైట్. సాధారణ బస్తీ అమ్మాయి.. బాక్సర్ గా పరిణామం చెందే పాత్రలో అదరగొట్టేసింది రితికా. మాధవన్ తో పోటీ పడి నటించి అందరి దృష్టినీ ఆకర్షించిందీ భామ.

ఐతే తొలి సినిమాలో రితికా చేసింది పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్ కావడంతో ఆమెలోని గ్లామర్ యాంగిల్ బయటికి రాలేదు. దీని తర్వాత ‘విజయ్ సేతుపతి’ సరసన చేసిన ఆండవన్ కాట్టలైలో కూడా పద్ధతిగానే కనిపించింది. లారెన్స్ తో చేసిన ‘శివలింగా’లోనూ ఆమె మామూలుగానే కనిపిస్తోంది. ఐతే ట్రెడిషనల్ హీరోయిన్ గా ముద్ర వేసుకుంటే కెరీర్ ఎంతో కాలం కొనసాగదని భావించిన రితికా ఇప్పుడు రూటు మార్చేసింది. ఉన్నట్లుండి హాట్ హాట్ ఫొటో షూట్లతో రెచ్చిపోతోంది.

ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం ఆమె ఇచ్చిన పోజులు కుర్రాళ్ల మతులు పోగొడుతున్నాయి. తనలోనూ గ్లామర్ పాళ్లు బాగానే ఉన్నాయని.. తనను ఆ రకంగానూ ఉపయోగించుకోవచ్చని ఈ ఫొటో షూట్ ద్వారా సంకేతాలిస్తున్నట్లుంది రితికా. మరి ఆమె పిలుపు అర్థమై దర్శక నిర్మాతలు ఎలాంటి అవకాశాలిస్తారో చూడాలి. ‘ఇరుదు సుట్రు’ రీమేక్ ‘గురు’తో రితికా తెలుగు ప్రేక్షకులకూ పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/